Thursday, November 28, 2024

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎపిలో పారిశ్రామిక పాలసీలు!

  • అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిగా అడుగులు
  • డిసెంబర్ నుంచి అమరావతి పనులు… $5 బిలియన్లతో క్యాపిటల్ రీజియన్ అభివృద్ధి
  • ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో యావియేషన్ వర్సిటీ, డాటా సెంటర్ ఏర్పాటు
  • శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ రౌండ్ టేబుల్ సమావేశం

శాన్ ఫ్రాన్సిస్కో (యుఎస్ఎ): అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, యువతకు రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఆరు పాలసీలను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో మీ నుంచి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఎదురుచూస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కియా ఒక ఉదాహరణ, రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. ఎపిలో దేశంలోనే 2వ అతిపెద్ద తీరప్రాంతం ఉంది. త్వరలో 4కొత్త పోర్టులు రాబోతున్నాయి. కర్నూలుజిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్ గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లలో 25శాతం ఎపిలోనే తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా 50శాతం ఎసిలు కూడా ఎపిలోనే తయారవుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశంజిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం.

 

*డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని పనులు*

 

కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజయన్ లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాం. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణపనులు ప్రారంభం కాబోతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టిసారించాం. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రాబోతున్నాయి. త్వరలో టిసిఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు యువకుడైన సాయికాంత్ వర్మ నేతృత్వంలో ఈడిబిని పునరుద్దరించాం. రాజకీయంగా జాతీయస్థాయిలో కీలకపాత్ర వహిస్తుండటం ఎపికి కలసి వస్తోంది. భారత్ లో డాటా రెవెల్యూషన్ రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఎపి కీలకపాత్ర పోషించబోతోంది. ప్రధాని మంత్రి మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా ముందుకు సాగుతోంది. అమెరికాలోని వివిధరంగాల పారిశ్రామికవేత్తలు ఎపికి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.

 

*ఎపి అభివృద్ధిలో భాగస్వాములు కండి: శ్రీకర్ రెడ్డి*

 

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించేందుకు సిఎం చంద్రబాబునాయుడు, ఐటి మంత్రి లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో కాన్సిలేట్ జనరల్ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకుందని అన్నారు. ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ ఎంఆర్ రంగస్వామి, ఫాల్కన్ ఎక్స్ కో ఫౌండర్ రాజు ఇందుకూరి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రావు సూరపనేని, ఎ5 కార్పొరేషన్ సిఇఓ వినయ్ కృత్తివెంటి, అప్లయ్డ్ మెటీరియల్స్ సిటిఓ ఓం నలమాసు, పై డాటాసెంటర్ సిఇఓ కళ్యాణ్ ముప్పనేని, గ్లోబల్ ఇండస్ట్రీ ఎనలిస్ట్స్ సిఇఓ రాంరెడ్డి, ఐటి సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హరి గక్కని, సురేషే మానుకొండ, వినోద్ బాబు ఉప్పు, వినయ్ పర్చూరి, రిఫిక్స్ ఎఐ సిఇఓ అనిరుథ్ రెడ్డి, క్లియర్ స్టోన్ వెంచర్ డైరక్టర్ విష్ మిశ్రా, టిసిఎస్ బిజినెస్ యూనిట్ హెడ్ కేశవ్ వర్మ, నడ్జ్ ఎఐ సిఇఓ సారీన్ షా, వెస్ట్ బ్రిడ్జి క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ రవి కన్నెగంటి, బాటా ప్రతినిధులు శ్రీమతి విజయ ఆసూరి, జయరామ్ కోమటి, సిలికానాంధ్ర ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభొట్ల, కార్యదర్శి రాజు చామర్తి, హాస్ బిజినెస్ స్కూల్ డైరక్టర్ ప్రొఫెసర్ సోలోమన్ డార్విన్, సోలిక్స్ టెక్నాలజీస్ సిఇఓ సాయి గుండవల్లి, ఐసెరా కో ఫౌండర్, ముద్దు సుధాకర్, టాల్ హాస్పటల్స్ సిఇఓ కిషోర్ గాదిరాజు, ఎపి ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular