Monday, November 18, 2024

Insurance Lok Adalat వచ్చే నెల మొదటి వారంలో విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అదాలత్

  • బుడమేరు వరదల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల బీమా క్లైమ్ల పరిష్కారానికి చక్కని వేదిక
  • రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత

అమరావతి, సెప్టెంబరు 25: ఈ నెల మొదటి వారంలో సంభవించిన బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయము అయిన కారణంగా దెబ్బదితిన్న పలు మోటారు వాహనాల భీమా క్లైమ్ల సత్వర పరిష్కారానికై వచ్చే నెల 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహించనున్నామని, వరధ బాదితులు అందరూ ఈ అధాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యారు సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబిత విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయం దగ్గర్లోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో భీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్ మరియు ఆటో డ్రైవర్ల అసోషియేషన్ ప్రతినిధులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మోటారు వాహనాల భీమా క్లైమ్ల సత్వర పరిష్కార అంశంలో ఎదురవుతున్న పలు సమస్యలు వాటి పరిష్కారానికై తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు కార్య నిర్వాహాక అధ్యక్షులు, న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ గారి ఆదేశాల మేరకు ఈ ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గతంలో ఎన్నడూలేని విధంగా బుడమేరు వరదలవల్ల వారం రోజుల పాటు విజయవాడ నగరం అస్తవ్యస్తం అయిపోందన్నారు. ఇది ఎవరూ ఊహించని ప్రకృతి విపత్తు అన్నారు. ఈ విపత్తు వల్ల ఎన్నో గృహాలు, గృహాప కరణాలు, వాహనాలు జలమయం అవ్వడమే కాకుండా కొంత మంది ప్రాణాలను కోల్పోవడం కూడా జరిగిందన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తరపున తాము కూడా వరద ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో అందజేస్తున్న సహాయక చర్యలను పరిశీలించడం జరిగిందన్నారు. వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయం లో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచించిన అనేక న్యాయ సేవలు అందించటానికి తమ సంస్థ కృషి చేస్తుందని వారు వివరించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తరపున వరద బాదితులను ఆదుకోవాలనే సంకల్పంతో మోటారు వాహనాల బీమా క్లైమ్ల సత్వర పరిష్కారానికై ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను అక్టోబర్ 1 వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విజయవాడ లోని న్యాయస్థాన సముదాయాలలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ లోపు మోటారు వాహనాల బీమా క్లైమ్లకు సంబందించి వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ సానుకూలంగా పరిశీలిస్తూ బాదితులకు సాద్యమైనంత మేర మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీల ప్రతినిధులను ఆమె కోరారు. అదే విధంగా వాహన మరమత్తుల విషయంలో ఆటోమొబైల్ బాడీ షాప్స్ ప్రతినిధుల కూడా సానుకూలంగా స్పందిస్తూ వాహనాల మరమ్మత్తు పనులను సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. భీమా క్లైమ్లు, వాహన మరమత్తుల విషయంలో సమస్యలు ఏమన్నా ఉంటే వాటి పరిష్కారానికై జాతీయ టోల్ ఫ్రీ నెంబరు 15100 కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సేవలు పొందవచ్చన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అఫిషియల్ వెబ్ సైట్లో సంబందిత బాదితులు ఫిర్యాధులను నమోదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. భారత రాజ్యాంగం (39-ఎ) ఆర్టికల్ ప్రకారం న్యాయ సేవలను ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.

సమావేశ ప్రారంభంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్.అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ బుడమేరు వరదల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల భీమా క్లైమ్ల పరిష్కారానికి వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించే ఇన్సూరెన్సు లోక్ అథాలత్ చక్కని వేదిక అని, ఈ అవకాశాన్ని వరద బాదితులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.వెంకటేశ్వరరావు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సహాయ కార్యదర్శి యన్.జేజేశ్వర రావు, బీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్ మరియు ఆటో డ్రైవర్ల అసోషియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular