Saturday, April 5, 2025

ఇంటర్‌ అకడమిక్‌ క్యాలండర్‌ విడుదల

సెప్టెంబర్‌లో దసరా సెలవులు.. జూన్‌లో కాలేజీ స్టార్ట్‌

తెలంగాణ ఇంటర్‌బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలండర్​ విడుదల చేసింది. సెప్టెంబర్ 28-అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు, జనవరి 11-18 వరకు సంక్రాంతి సెలవులు, ఏప్రిల్ 1-మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించింది. జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌లో కాలేజీ పనిదినాలు, తరగతులు, సెలవులు, ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 2 నుంచి ఇంటర్ కళాశాళలు మొదలు అవుతాయని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు సమ్మర్ హాలిడేస్ అని తెలిపారు. అందువల్ల ఏవైనా కాలేజీలు ఈ వేసవి సెలవుల్లో క్లాస్‌లు నిర్వహింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ సారి ఇంటర్ తరగతులు మొత్తం 226 రోజుల పాటు ఉండనున్నాయి. అంతేకాకుండా జూనియర్ కళాశాళలకు 77 రోజులు సెలవులు రానున్నాయి. 2026 ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మార్చి నెలలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం..
దసరా సెలవులు: 2025 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు సెలవులు.
ఆఫ్ ఇయర్ ఎగ్జామ్స్ : 2025 నవంబర్ 10 నుంచి 15 వరకు ఇంటర్ ఆఫ్ ఇయర్ పరీక్షలు
సంక్రాంతి సెలవులు: 2026 జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.
ప్రాక్టికల్స్: 2026 ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి.
ఫైనల్ పరీక్షలు: 2026 మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి.
వేసవి సెలవులు: 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి.
తరగతులు ప్రారంభం: 2026 జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం తరగతులు మళ్లీ పున:ప్రారంభం అవుతాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com