Monday, March 10, 2025

ఈనెల 25లోగా ఇంటర్ ఫలితాలు

  • ఈనెల 25లోగా ఇంటర్ ఫలితాలు
  • ముగిసిన ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్
  • ఈసీ నుంచి అనుమతి రాగానే ఇంటర్ ఫలితాలు

టీఎస్​, న్యూస్ :రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ పూర్తిచేసి ఇంటర్ బోర్డు, ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలిస్తోంది. మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఓఎంఆర్ షీట్ కోడ్ డీ కోడ్ చేయడం వంటి పనులకు ఇంకొన్ని రోజులు టైమ్ పట్టనుంది. ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. తదనంతరం 2, 3 రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ఖరారు చేస్తారని సమాచారం. ఈసారి కూడా ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం దాదాపు 9 లక్షల మంది విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తుడంగా…ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారు కానుంది. దాదాపు ఏప్రిల్ చివరి వారంలోని ఏ తేదీలోనైనా వెల్లడించే ఛాన్స్ ఉంది. ఎంసెట్ తో పాటు మరిన్ని పరీక్షల దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com