హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన అరుంధని అనే ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. దిల్‌షుక్ నగర్ కొత్తపేట నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. బైపీసీ తీసుకుని మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఇంటర్ పరీక్షాల ఫలితాలు వచ్చాయి. మొదటి సంత్సరంలో ఆమె ఉత్తీర్ణత సాధించకపోగా ఫెయిల్ అయిందనే మనస్థాపంతో తట్టి అన్నారంలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అరుంధతిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైధ్యులు పరీక్ష చేసి నిర్ధారించారు.