Sunday, April 20, 2025

వృద్ధులకు విశిష్ట సేవలందించిన…

వయోవృద్ధులు, సంస్థల నుండి దరఖాస్తుల ఆహ్వానం
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయో వృద్ధులు, నిరుపేద సీనియర్ సిటిజన్లకు విశిష్ట సేవలందించడంలో నిమగ్నమైన అర్హులైన సంస్థలకు రాష్ట్ర స్థాయి అవార్డులను అందజేయనున్నట్లు వికలాంగులు, వయోవృద్ధుల సాధికారిక శాఖ ప్రకటించింది. ఇందు కోసం అర్హులైన వయో వృద్ధులు, సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. పూర్తి వివరాలు (అవార్డు కేటగిరీలు, సబ్- కటగిరీలు, అర్హతలు, దరఖాస్తు విధానం, క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్, అప్లికేషన్-ఫారమ్)

www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్ నుండి పొందవచ్చని సూచించింది. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు, సంబంధిత దృవపత్రాలు జతపరచి, ఈ నెల 25న సా. 5 గంటల లోపు హైదరాబాద్, మలక్‌పేట వికలాంగుల సంక్షేమ భవన్‌లోని సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలని సూచించింది. ఇట్టి నోటిఫికేషన్ ను రద్దు పరచడం, మార్పులు చేయడానికి సంచాలకులకు పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు ఫోన్ 9652394751, 040-245590480 ను సంప్రదించవచ్చని సూచించారు. నిర్ణీత తేదీలలో ఒరిజినల్ దరఖాస్తు ఫారాలను పైన తెలిపిన కార్యాలయంలో సమర్పించనిచో అట్టి దరఖాస్తులు తిరస్కరించబడుతాయని వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com