Monday, January 27, 2025

ఇంటికి తాత్కాలిక బ్రేక్‌ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు ఇంకొంతకాలం ఆగాల్సిందే. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇళ్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఓవైపు ఈనెల 26 నుంచి నాలుగు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుండగా.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తుండగా.. కొత్త లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం లేదు. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది.

80.54 లక్షల మంది దరఖాస్తులు
గతంలో ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల మంది దరఖాస్తులు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీలకు వచ్చిన దరఖాస్తులను ఆసరాగా చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను అధికారులు ఎంపిక చేశారు. వీటి పరిశీలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లో లబ్దిదారుల వివరాలు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా… పలుచోట్ల దరఖాస్తు దారుల నుంచి సర్వే చేపట్టలేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభల్లో మరోసారి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.

మరింత పెరిగే ఛాన్స్
అయితే ఇందిరమ్మ ఇళ్ల పంపీణీలో ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇంటి స్థలం ఉండి ఇళ్లు కట్టుకునే వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. అయితే, నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ్రామసభల్లో అధికారులు రెండు రకాల వివరాలు సేకరిస్తున్నారు. లబ్దిదారుల్లో సొంత స్థలం ఉన్నవారు, ఇంటి జాగా లేనివారి వివరాలు ప్రత్యేకంగా సేకరిస్తున్నట్తు తెలుస్తోంది.
మరోవైపు లబ్దిదారుల ఎంపికకు సంబంధించి మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల లాగిన్‌లకు మాత్రమే పంపిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులకు, హౌసింగ్‌ శాఖ పీడీలకు ఈ సమాచారాన్ని అందించడం లేదని తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగంలో కూడా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారంలో స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జనవరి 26నుంచి పథకాన్ని ప్రారంభించినా.. లబ్దిదారుల జాబితా పూర్తి స్థాయిలో అధికారులకు చేరేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక లబ్దిదారుల ఎంపిక ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులే ఫైనల్ చేస్తుండటంతో లబ్దిదారుల ఎంపిక, ఇళ్ల పంపీణీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com