భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. భారత-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. “ఐపీఎల్ ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని.. కేంద్రం, అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత నిర్వాహకుల సలహా తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి ఎలాంటి మ్యాచ్ జరగదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2025 లో 57 మ్యాచ్‌లు విజయవంతంగా జరిగాయి, అయితే మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ వర్సెస్ ఢిల్లీ) ను భద్రతా కారణాల రీత్యా ఆపివేశారు. జమ్ముతో సహా అనేక ప్రాంతాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది, వాటిని భారత సైన్యం ఖండించింది. కానీ జాగ్రత్త చర్యగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపివేసి ఆటగాళ్లను హోటళ్లకు తరలించారు.