Saturday, May 17, 2025

ఆట మళ్లీ మొదలు ఐపీఎల్ రీ స్టార్ట్

ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఒక్క కరోనా టైమ్ లో రెండేళ్లు తప్ప ఎప్పుడూ ఆగింది లేదు. ఆ తరువాత కూడా ఐపీఎల్ కు అంతరాయం కలుగుతుందని క్రికెటర్లతో సహా ఎవరూ ఊహించలేదు. కానీ, అనూహ్యంగా భారత్, పాక్ వార్ కారణంగా ఈసారి ఐపీఎల్ అర్థాంతరంగా ఆపాల్సి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ, ఆటగాళ్ళు సేఫ్టీ కోసం మ్యాచ్ లను కొనసాగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు చక్కబడడం… యుద్ధం ఆగిపోవడంతో మళ్ళీ మొదలెట్టాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఐపీఎల్ 18 సీజన్ మళ్ళీ తిరిగి ప్రారంభం కానుంది. ముందు కొన్ని మ్యాచ్ లు అయిపోగా.. ఇంకా 13 లీగ్ మ్యాచ్ లు, నాలుగు ప్లే ఆఫ్స్, ఒక ఫైనల్ మిగిలి ఉన్నాయి. ఇప్పటికే జరిగిన మ్యాచ్ లలో మూడు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు నాలుగు స్థానాల కోసం మిగతా ఏడు జట్లు పోటీ పడనున్నాయి.

ఆర్సీబీ VS కోలకత్తా నైట్ రైడర్స్..
శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోలకత్తా నైట్ రైడర్స్ ఢీకొనబోతున్నాయి. సొంతగ్రౌండ్ లో కనుక ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెడుతుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటికి 11 మ్యాచ్ లు ఆడి 16 పాయింట్లతో టాప్ లో ఉంది. మరోవైపు కోలకత్తా 12 మ్యాచ్ లు ఆడి 11 పాయింట్లతో ఉంది. అయితే ఇవాల్టి నుంచి జరగనున్న మ్యాచ్ లు అన్నీ చాలా కీలకం. ఎందుకంటే లీగ్ కు బ్రేక్ పడడంతో చాలా మంది వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. అందులో ఇప్పుడు మ్యాచ్ లు ఆడ్డానికి రావడం లేదు. దీని ప్రభావం మ్యాచ్ లు, జట్ల మీద గట్టిగానే పడనుంది. ఆర్సీబీలో హేజిల్ వుడ్ మళ్ళీ వస్తున్నా… అతను లీగ్ ఆడ్డానికి ముందే గాయపడి ఉన్నాడు. అందుకే ఇప్పుడు అతను జట్టులో చేరతాడా లేదా అనేది స్పష్టత లేదు. ఆల్ రౌండర్ బెతెల్ అందుబాటులో లేడు. సాల్ట్, ఎంగిడి, డేవిడ్, లివింగ్‌స్టన్, షెఫర్డ్‌ ఆ జట్టుతో చేరారు. గాయంతో బాధ పడుతున్న కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ కోలుకుని ఈ మ్యాచ్‌లో ఆడబోతుండడం ఆర్సీబీకి ఉపశమనమే. ఇక కోలకత్తా జట్టులోని మొయిన్ ఆలీ ఆడటం లేదు. అయితే కీలక ఆటగాళ్ళు మొయిన్‌ అలీ సేవలను కోల్పోయింది. కానీ నరైన్, రసెల్, గుర్బాజ్‌ లు మాత్రం అందుబాటులోనే ఉండడం ఆ జట్టుకు ప్లస్. ఈ మ్యాచ్ కోలకత్తాకు చావో రేవో అన్నట్లే. ఈ మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు చాలా ముఖ్యం. మరోవైపు మ్యాచ్ కు వర్షం వల్ల కూడా అంతరాయం ఉండొచ్చని వాతావరణశాఖ చెబుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com