వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆణిముత్యం పూరిజగన్నాధ్. వర్మలానే కొంతకాలం తరువాత చల్లబడిపోతారు. కొంత కాలం మంచి సినిమాలు తీసిన తరువాత ఫేమ్‌లోకి వచ్చాక మాకేంటిలే అన్న ధోరిణిలో ఉంటాయి వీరి సినిమాలు. దాంతో సినిమాలన్నీ కూడా సంతకెళ్లిపోతాయి. ఆర్జీవీ నుంచి వచ్చిన ఆనవాయితీలా ఉంది. ఆయనా అంతే చిత్ర విచిత్రంగా మాట్లాడతారు. నాకు నచ్చింది నేను చేస్తా.. నాకు నచ్చింది నేను తీస్తా మీకు ఇష్టమైతే చూడండి లేదంటే లేదు అంటూ విడ్ఢూరంగా మాట్లాడతారు. ఇక వాళ్ళ శిష్యులు కూడా దాదాపు అదే లైనలో ఉంటారు.
ఇక పూరి సినీ ప్రయాణం మొత్తం చూసుకుంటే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను సృష్టించారు. చిన్న సినిమా, పెద్ద సినిమా ఇలా ఎన్నో రకాల సినిమాలు తీశారు. బద్రి, శివమణి, ఇడియట్, శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, బిజినెస్‌మేన్ ఇలా లిస్ట్ చూసుకుంటే చాలా పెద్దదే అని చెప్పవచ్చు. ప్రతి పాత్ర చాలా సింపుల్‌గా ఉంటుంది. ఏ పాత్రకు ఉండవలసిన ఫిలాసఫీ దానికే ఉంటుంది. అది కొంచం డెప్త్‌కి వెళ్ళి చూస్తే ఫిలాసఫీ అర్ధం అవుతుంది.
మరి అలాంటి దర్శకుడు పూరి రాను రాను ఇలా అర్ధం పర్ధం లేని సినిమాలు తీయడం టేకింగ్‌ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఆయన ఫ్లాప్ సినిమాల వైపు చూస్తే ఇది అర్ధం అవుతుంది. ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదు. ఓసారి ఆయన ఫ్లాప్ సినిమాలవైపు చూస్తే క్లియర్‌గా అర్ధం అవుతుంది. పూరి కాన్‌సన్‌ట్రేట్ చేస్తే ఆ ప్రాడెక్ట్ రేంజే వేరని చెప్పాలి. ఆయన సీరియస్‌గా.. సిన్సియర్‌గా కథ మీద కూర్చుంటే ఆ కథే వేరే లెవల్‌లో ఉంటుంది. పూరి సినిమా అంటే మంచి హైప్ క్రియేట్ అవుతుంది. తీరా అది అవుట్‌పుట్ వచ్చాక చూస్తే నాన్నా పులి కథలా ఉంటుంది.
ఇక ప్రేక్షకులు ఒకసారి మోసపోతారు.. రెండు సార్లుమోసపోతారు. పూరి అంటే ఎంత అభిమానం ఉన్నా ఇలా ప్రతిసారీ మోసపోరు కదా. అదే విధంగా పోగొట్టుకున్న ప్రతీసారి తిరిగి మళ్ళీ అవకాశం దొరకడం కూడా కష్టమే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్లు ఇచ్చినా కూడా విజయ్‌సేతుపతి లాంటి వెర్సటైల్ ఆర్టిస్ట్‌తో పూరికి అవకాశం రావడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. పూరికి తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. మరి ప్రేక్షులకి ఈ సారి ఎలాంటి భోజనాన్ని వడ్డిస్తాడో చూడాలి.