Saturday, February 8, 2025

ఇప్పుడేం చేద్దాం..? దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యే మీటింగ్‌

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసుల భయం పట్టుకున్నది. దీంతో హడావుడిగా బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇంట్లో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు అందుకున్న ఈ పది మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సెక్రటరీతో పాటు సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనే అంశంపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు. వీరంతా భేటీ అయినట్లు సీఎంకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే అక్కడకు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని పంపించారు.

వాట్‌ నెక్ట్స్‌..?
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్నారు. కానీ, దీనిపై బీఆర్‌ఎస్‌ మాత్రం వరుస పిటిషన్లతో న్యాయస్థానం మెట్లు ఎక్కింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందాయి. దీంతో స్పీకర్‌ కూడా స్పందించాల్సి వచ్చింద. ఓ వైపు అసెంబ్లీ జరుగుతుండగానే.. ఈ పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు ఇచ్చారు. దీంతో పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి..? అనే అంశంపై ఎమ్మెల్యేలో దానం నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకోర్టు కు ఇచ్చే ఆన్సర్లపై కూడా చర్చ జరగనున్నట్లు టాక్ నడుస్తోంది. పార్టీ పార్టీయింపులకు పాల్పడిన ఈ ఎమ్మెల్యేలందరూ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? అనే దానిపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలు భయపడకుండా సీఎం తరపున వేం నరేందర్‌ రెడ్డిని పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీకి ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్పు వ్యవహారంపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు అందుకున్న ఫిరాయించిన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని అడిగారు.
2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని దారుణ ఓటమిని చవిచూసింది. అయితే.. బీఆర్ఎస్ ఓటమి అనంతరం కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి క్యూకట్టారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలోకి చేరారు. తర్వాత, అయితే ఇంకొంత మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడుతారనే టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత ఎవరూ కాంగ్రెస్ పార్టీలో వెళ్లలేదు. పార్టీ ఫిరాయించిన ఆ పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో బీఆర్‌ఎస్ కు అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నిన్న ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యం కారణంగా ఎమ్మెల్యేలు నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలని భేటీ అయినట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com