ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి
తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మువ్వ విజయ్ బాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్13 లోని ఆ సంస్థ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మువ్వ విజయ్ బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయ్‌బాబును ప్రత్యేకంగా అభినందించారు. టిజిసిఐ, చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌బాబుకు నాయకులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.