ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమాతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి అందాల ఆరబోత చేయడం ద్వారా మరింత మందికి ఈ అమ్మడు చేరువ అయ్యింది. కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ ను దక్కించుకున్న అనుపమ కొత్త సినిమా విషయంలో ఆలోచనలో పడింది. టిల్లు విడుదల అయిన వెంటనే ముద్దుగుమ్మకు ఆఫర్లు వచ్చాయట. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం అందుతోంది. కొత్త సినిమా సైన్ చెయ్యడానికి ఈ అమ్మడు వెయిట్ చేస్తుంది. అయితే ఈ వెయిటింగ్ పారితోషికం పెంచడానికి అనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఒక్క హిట్ పడగానే భారీగా పారితోషికం పెంచేస్తున్నారు. కనుక ఈ అమ్మడు కూడా తన పారితోషికం ను అమాంతం పెంచాలనే ఉద్దేశ్యంతో ఒక పెద్ద ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. చిన్న ప్రాజెక్ట్ ల్లో చేయడం ద్వారా భారీ పారితోషికం దక్కదు అనే ఉద్దేశ్యంతో అనుపమ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది.