- జాబితాలో మాజీ సీఎం జగన్ ఇల్లు
- హైడ్రా నోటీసులు.. హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?
- నోటీసులు ఇవ్వలేదన్న రంగనాథ్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టినట్లుగా ఉంది. ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత హీటెక్కింది. గత కొన్ని రోజులుగా హైడ్రా హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసిందని వార్తలు వస్తు్న్నాయి. ఈ వార్తలపై హైడ్రా కమిషన్ స్పందించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా తన ఉక్కుపాదాన్ని మోపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్‌కు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జగన్‌కు చెందిన లోటస్ పాండ్ కూల్చివేతకు హైడ్రా రంగం సిద్ధం చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ స్పందించారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు చెందిన లోటస్ పాండ్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని త్వరలోనే దాన్ని హైడ్రా కూల్చివేస్తుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తాము వైఎస్ జగన్‌కు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అందులో నిజం లేదని వెల్లడించారు. ఇటీవలే కాంగ్రెస్ సర్కార్ వైఎస్ జగన్‌కు చెందిన లోటస్ పాండ్ ముందు కొన్ని కట్టడాలను కూల్చివేసింది. లోటస్ పాండ్ ముందు తన సెక్యూరిటీ కోసం నిర్ణంచిన కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. రోడ్డుపైకి కట్టడాలు ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేయగా అధికారులు కూల్చివేశారు.