Friday, September 20, 2024

రాజాసాబ్‌ రాజ్యమేలతాడా?

ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ హారర్‌, కామెడీ, థ్రీల్లర్స్‌కి పెద్ద పీట వేస్తున్నారు దర్శకులు. అలాంటి స్టోరీలను ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం హర్రర్‌ కామెడీ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. అన్ని భాషల నుంచి క్రమం తప్పకుండా వరుసగా హర్రర్‌ కామెడీ సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన పలు హర్రర్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని మాత్రం నిరాశ పరిచాయి. బాలీవుడ్ లో విడుదలైన ‘స్త్రీ 2’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద కోట్లు వసూళ్లు అయితే గొప్ప విషయం అనుకుంటే స్త్రీ 2 ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాహుబలి 1 రికార్డ్‌ లతో పాటు పలు రికార్డులను స్త్రీ 2 సినిమా బ్రేక్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. స్త్రీ 2 సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో త్వరలోనే రాబోతున్న ప్రభాస్‌, మారుతిల ‘రాజా సాబ్‌’ కూడా ఘన విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దర్శకుడు మారుతి రాజాసాబ్ సినిమాను హర్రర్‌ కామెడీ కాన్సెప్ట్‌ తో రూపొందిస్తున్నాడు. ప్రభాస్‌ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో రాజాసాబ్‌ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా ప్రభాస్ గత చిత్రాలు సలార్‌, కల్కి లు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచిన విషయం తెల్సిందే. ప్రభాస్ ను ఇన్ని రోజులు వరుసగా యాక్షన్ సినిమాల్లోనే చూస్తున్న ప్రేక్షకులకు కాస్త మార్పు అన్నట్లుగా హర్రర్‌ సినిమాలో అదీ కామెడీ టచ్ ఉండే సబ్జెక్ట్‌ లో చూడబోతున్నందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న రాజాసాబ్‌ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 ఏప్రిల్‌ 10న రాజాసాబ్‌ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos