Tuesday, May 6, 2025

సామ్‌ సైలెంట్‌గా చెక్కేస్తుందా?

సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు, షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే. గత ఏడాది నుంచి విశ్రాంతి తీసుకుంటూ విదేశాల్లో చక్కర్లు కొడుతున్న సమంత తిరిగి షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. సమంత ఇప్పటికే నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ వెబ్ సిరీస్ తర్వాత హిందీలో వరుసగా సమంత సినిమాలు చేసేందుకు గాను రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

ముంబై లో సమంత ప్రస్తుతం ఒక మంచి ఇంటిని కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం కోసం సెర్చింగ్‌ లో ఉందట. ముంబైకి చెందిన ఆమె సన్నిహితులు ఇంటి విషయంలో ఆమెకు సహాయం చేస్తున్నారు. సౌత్‌ లో ఆమె ఓకే అనాలే కానీ ఒకే సారి నాలుగు అయిదు ఆఫర్లు వస్తాయి. కానీ సామ్‌ మాత్రం సైలెంట్‌ గా ముంబై చెక్కేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు మాట్లాడుకునే విషయాలను బట్టి అర్థం అవుతుంది. పర్సనల్‌ ప్రాబ్లమ్స్ మరియు బాలీవుడ్‌ లో దక్కిన గుర్తింపు కారణంగా ఇకపై పూర్తిగా హిందీ సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు చేయాలనే నిర్ణయానికి సమంత వచ్చిందనే టాక్‌ వినిపిస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com