Monday, November 18, 2024

ఎన్నికలకు సిద్ధమైన దళపతి…?

కోలీవుడ్ స్టార్ హీరో “ద‌ళ‌ప‌తి” విజ‌య్ ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తమిళనాట సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి స్టార్‌ డమ్‌ సంపాదించుకున్న నటుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ లో విజ‌య్ త‌న బ‌లాన్ని పెంచుకుంటూ వ‌స్తున్నారు. ఆయన సినిమాలు హిట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ద‌గ్గర వ‌సూళ్ల సునామీని క్రియేట్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పార్టీ పేరు త్వరలో ప్రకటించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉండేది. ఇక ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని కోరుకుంటూ లక్షల మంది అభిమానులు ఆన్ లైన్ వేదికగా వెల్ కం చెబుతూ.. వారి వారి ఆకాంక్షలను బయటపెడుతుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం వారి కోరిక నెరవేరబోతుందని తెలుస్తుంది. అవును… కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్న విజయ్‌.. ప్రతిభ కనబరిచిన పదో తరగతి, ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా చదువు విలువ గురించి, ఓటును అమ్ముకునే విషయం గురించి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకూ ఆయా సమావేశాల్లో చాలా చక్కగా చెబుతుంటారు. ఒకపక్క సినిమాల్లో తీరికలేకుండా ఉన్న విజయ్‌.. మరోపక్క సోషల్ సర్వీస్ లోనూ తన వంతు సేవ చేస్తూనే ఉంటారు.

వాస్తవానికి ఒకానొకసమయంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారని కథనాలొచ్చాయి. అయితే… ఇటీవల ఆయన రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో.. దళపతి విజయ్‌ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్నారని.. ఆమేరకు అభిమానులు, శ్రేయోభిలాషులు, కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ తో సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది. “విజయ్‌ మక్కల్‌ ఇయక్కం” (అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయిన దళపతి… తాజాగా చెన్నై శివారు పనైయూర్‌ లో 150 మందితో సమావేశం ఏర్పాటు చేసి.. అందులో పార్టీ పేరుతో పాటు జెండా, అజెండాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో పార్టీపేరుపైనే ఆయన ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో మూడు పదాలతో ఒక పేరు వినిపించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా… తమిళగం (తమిళనాడు), మున్నేట్రం (డెవలప్మెంట్), కళగం (పార్టీ) వంటి పదాలను విజయ్‌ సూచించారని.. అనంతరం ఈ మూడు పదాలు కలిసేలా “తమిళగ మున్నేట్ర కళగం” పేరును ప్రస్థావించారని.. ఇదే పేరు ఎన్నికల సంఘంలో కూడా నమోదు చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దళపతి పార్టీ నిజమేనా ఆయన ఏ రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular