Monday, March 31, 2025

ఐశ్వర్యరాయ్‌ కారును ఢీ కొట్టిన బస్సు…ఆందోళనలో ఫ్యాన్స్‌

ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ మాజీ ప్రపంచ సుందరి, అందాల కథానాయిక బాలీవుడ్‌ బ్యూటీ కారును బస్సు ఢీ కొట్టింది. ఖ‌రీదైన బెంజ్ కార్ ని బ‌స్సు వెనుక నుంచి ఢీకొట్ట‌గా, రోడ్ మ‌ధ్య‌లో కార్ ని నిలిపివేసిన దృశ్యాలు ఇప్పుడు అంత‌టా వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆ కార్ లో ఐశ్వ‌ర్యారాయ్ ఉన్నారా? త‌న‌కు ఏదైనా ప్ర‌మాదం సంభ‌వించిందా? అంటూ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కానీ అదృష్టవశాత్తూ ఆ సమయంలో కార్ లో ఐశ్వ‌ర్యారాయ్ లేరు. ఇది ఒక‌ చిన్న సంఘటన.. నిజానికి ఐష్ కి ఎలాంటి నష్టం ఏమీ లేదు. ఆమె క్షేమంగా ఉన్నారు.

స‌న్నిహితులు ఎటువంటి ప్రమాదం జరగలేదని ధృవీకరించారు!. ప్ర‌మాద స్థ‌లంలో ఐశ్వ‌ర్యారాయ్ బెంజ్ కార్ కొద్దిసేపు ఆగినా, ఆ త‌ర్వాత గార్డులు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డంతో అక్క‌డి నుంచి కార్ వెళ్లిపోయిన దృశ్యాలు వీడియోల్లో క‌నిపిస్తున్నాయి. కార్ వెన‌క భాగంలో కొన్ని స్క్రాచ్ లు కూడా క‌నిపిస్తున్నాయి. బ‌స్ నెమ్మ‌దిగా వ‌చ్చి కార్ ని ర‌బ్ చేసింది. కానీ అది పూర్తిగా బ‌లంగా ఢీకొట్ట‌లేదు అని ఒక సోర్స్ స్పష్టం చేసింది. ఐష్ కార్ ని ఎర్ర బస్సు ఢీకొట్టినట్లు వీడియోల్లో క‌నిపిస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కార్ ని బ‌స్సు ఢీకొట్టింద‌ని క‌థ‌నాలు వేయ‌డంతో అభిమానులు చాలా కంగారు ప‌డ్డారు. అభిమానులను ఈ ఘ‌ట‌న తీవ్ర‌ ఆందోళనలకు గురి చేసింది. కానీ ఆ త‌ర్వాత కార్ లో ఐష్ లేద‌ని తెలిసాక అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com