Sunday, November 17, 2024

లెబనాన్ పై ఇజ్రాయెల్‌ దాడులు.. 356 మంది మృతి

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భయంకరమైన దాడులకు పాల్పడుతోంది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. సోమవారం లెబనాన్ లోని సుమారు 300 లకు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మొత్తం 356 మంది మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. చనిపోయిన వారిలో 21 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దాడుల్లో మరో 1246 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచే ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడులు ముమ్మరం చేశాయని లెబనాన్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశంలోని గ్రామాలు, పట్టణాలను నామరూపాల్లేకుండా చేయాలనే పక్కా ప్రణాళికలో భాగంగానే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోందని లెబనాన్ ఆరోపించింది.

ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితితో పాటు అగ్ర దేశాలకు విజ్ఞప్తి చేసింది లెబనాన్. మరోవైపు హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని అంతకు ముందే ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. లెవనాన్ లోని దక్షిణ ప్రాంతంలో హెజ్‌బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే విడిచి వెళ్లాలని స్థానికులను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరికలతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఆ తరువాత బెకా లోయ ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది ఇజ్రాయెల్ సైన్యం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular