ఇస్రో మాజీ చైర్మెన్ డాక్టర్ కే కస్తూరిరంగన్ కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్లు. బెంగుళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం 10.43 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఇస్రో చైర్మెన్‌గా ఆయన తొమ్మిదేళ్లు పనిచేశారు. అంతరిక్ష రంగంలో భారత్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆగస్టు 27, 2003లో ఆయన ఇస్రో చైర్మన్ పదవీ నుంచి రిటైర్ అయ్యారు. ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ భాస్కరా-1, 2, కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా చేశారాయన. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్ఎస్-1ఏ ప్రయోగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేరళలోని ఎర్నాకుళంలో కస్తూరిరంగన్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ఆయన అందుకున్నారు.