- అదనపు కలెక్టర్, ఆర్టీఓ స్థాయిలో ధరణి దరఖాస్తులను పరిష్కరించేలా
- సర్క్యులర్ జారీ చేసిన సిసిఎల్‌ఏ చీఫ్ కమిషనర్
ధరణి పోర్టల్‌లో పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్, ఆర్టీఓ స్థాయిలో ధరణి దరఖాస్తులను పరిష్కరించేలా గురువారం భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ నవీన్‌మిట్టల్ మార్గదర్శకాలు జారీ చేశారు. ధరణి కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఈ సర్క్యులర్‌లో ఆయన పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్‌కు అధికారాలు ఇలా..
టిఎం3లో వచ్చిన మ్యుటేషన్‌లు, టిఎం24లో వచ్చిన దరఖాస్తులు, పిపిబి కోర్టు కేసులు, టిఎం31లో వచ్చిన పిపిబి అండ్ నాలా కన్వర్షన్‌కు సంబంధించిన దరఖాస్తులు, ఇళ్లు, ఇళ్లస్థలాలకు సంబంధించినవి పరిష్కరించాలని అధికారులు తెలిపారు. దీంతోపాటు టిఎం33 కింద వచ్చిన దరఖాస్తులతో పాటు పాస్‌బుక్‌లో తప్పొప్పులను సరిదిద్దేలా నవీన్‌మిట్టల్ మార్గదర్శకాలను జారీ చేశారు. వీటితో పాటు చేంజ్ ఆఫ్ నేమ్‌కు సంబంధించిన దరఖాస్తులను కూడా మూడురోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.
ఆర్డీఓలకు ఇచ్చిన అధికారాలు ఇలా…
టిఎం4లో వచ్చిన దరఖాస్తులు, సక్సేసన్, టిఎం27లో వచ్చినవి, నాలా పెండింగ్ దరఖాస్తులు, టిఎం33లో పెండింగ్‌లో ఉన్న డిజిటల్ సంతకాలు, జిఎల్‌ఎంలో వచ్చిన డిజిటల్ సంతకాలకు సంబంధించిన దరఖాస్తులను మూడురోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.