కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ మాజీ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోదరుడు మల్లు అనంతరాములు వర్ధంతిని పురస్కరించుకొని శనివారం దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి అనంతరాములు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పుష్పాంజలి ఘటించారు.కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి దీపదాస్ మున్షి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండాలి.. కొత్త మంత్రులుగా ఎవరు ప్రమాణం చేస్తారు అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని.. ఇందులో నా జోక్యం ఏ లేదని స్పష్టం చేశారాయన. దిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఈ కామెంట్స్ చేశారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలోనూ స్పందించారు. నేను ఎవర్నీ సిఫార్సు చేయలేదని వెల్లడించారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని.. పార్టీలో జరిగే ప్రతి విషయం అధిష్ఠానానికి తెలుసు అన్నారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదని వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీతో తన అనుబంధం ఏంటో తెలియని వాళ్లే.. ఏదేదో మాట్లాడుతున్నారని వివరించారాయన. పని చేసుకుంటూ పోవటమే తనకు తెలుసు అని.. ప్రతి విషయానికి వివరణ ఇచ్చుకుంటూ వెళ్లను అంటూ స్పందించారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను రాహుల్ ఇంటర్వ్యూ కోరలేదని కూడా అన్నారు. అయితే పిసిసి కూర్పు ఓ కొలిక్కి వచ్చినట్లేనని అన్నారు. ‘మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన మాకు లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన సర్వే చేశాం. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయింది. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది.
దీనిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ నేను కోరలేదు. రాహుల్‌తో నా అనుబంధంపై తెలియనివాళ్లు మాట్లాడితే నాకేంటి? ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్ఠానం దృష్టిలో ఉంటాయి. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటా. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు అని అన్నారు.. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా లక్ష్యం. పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు. ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు. కులగణనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారు. బీసీలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.