ఐటీ సెక్రెటరీని హెచ్చరించిన మంత్రి శ్రీధర్ బాబు
ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులపై ఆగ్రహం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు.. అధికారులపై మండిపడ్డారు. మొదటి సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్రంలో ఐటీ పరిస్థితులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని, మీడియాకు లికులు ఇవ్వకూడదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుండి తరలి వెళ్ళిపోతున్నాయని ప్రచారం జరుగుతుండటంపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టకూడదని ఐటీ సెక్రటరీని మందలించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ రంగంపై దృష్టి పెట్టామని, మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.