టాలీవుడ్‌కు ఐటీ షాక్
టాలీవుడ్.. ఇప్పుడు ఉలిక్కిపడుతుంది. మొన్నటిదాకా ప్రభుత్వంతో గొడవ.. ఇప్పుడు ఏదో గొప్పలు చెప్పుకున్నందుకు ఐటీ అధికారుల రెయిడ్స్.. మొత్తంగా సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాల్లో గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ బొక్కాబోర్లా పడ్డాయి. వీటికి ఒక నిర్మాత 400 కోట్లు, ఇంకోయన వంద కోట్లు.. మరో సినిమాకు రెండు వేల కోట్లు వచ్చాయంటూ పోస్టర్లు వేసుకుని.. గొప్పలు చెప్పుకున్నారు. ప్రేక్షకులు చూడని గేమ్ ఛేంజర్‌కు కూడా రూ. 200 కోట్లు వచ్చాయంటూ డప్పేసుకోవడంతో.. అదే అదునుగా ఐటీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. దీంతో ఇప్పుడు అసలు లెక్కలు బయట పడుతున్నాయి.
దిల్కా దడకన్ రాజా..! 400 కోట్ల లెక్కలు టార్గెట్
నిర్మాతలపై ఐటీ రైడ్స్. ముక్యంగా దిల్ రాజు, మైత్రీ మేకర్స్ పైజరుగుతున్న ఈ దాడులకు కారణం ఏంటి..? ఆ 400 కోట్లపైనే వివాదం అంతా నడుస్తుందా..? ఇందులో నిజం ఎంత..? అనేది ఇప్పుడు చర్చ. ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న వార్త ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతల పై ఐటీ రైడ్స్. మరీ ముఖ్యంగా టీఎఫ్సీ చైర్మెన్ అయిన దిల్ రాజు ఇంటి పై జరుగుతున్న ఐటీ రైడ్స్ హాట్ టాపిక్ గామారాయి. దిల్ రాజు మాత్రమే కాదు.. ఆయన కూతురు హన్షిత రెడ్డి తో పాటు ఆఫీస్ లు బంధువులు, ఇలా ఆయనకు సబంధించిన దాదాపు 55 ప్రదేశాల్లో ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు చేశారు. సడెన్ గా ఐటీ ఎంట్రీ ఇచ్చేవరకూ టాలీవుడ్ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. అయితే ఈ ఐటీ రైడ్స్ కు కారణం రీసెంట్ గా దిల్ రాజు మూడు సినిమాలే అని సమాచారం. గేమ్ ఛేంజర్ త పాటు సంక్రాంతికి వస్తున్నాం. డాకుమహరాజ్ సినిమాల వల్లే దిల్ రాజు పై ఇలా ఐటీ రైడ్స్ జరిగాయని టాలీవుడ్ లో గుసగులసాడుకుంటున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలను దిల్ రాజు స్వయంగా నిర్మించారు. అంతే కాదు వీటితో పాటు బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాకు దిల్ రాజు నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఇక . ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం, గేమ్ చేంజర్ మూవీ మాత్రం ప్లాప్ గా నిలిచింది. సంగం కూడా వసూళ్ళు చేయలేకపోయింది సినిమా. అదేంటి గేమ్ ఛేంజర్ ప్లాప్ అయ్యింది కదా.. మరి అని అందరికి అనుమానం రావచ్చు. కాని ఇక్కడే మేకర్స్ చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు. ఈ మూడు సినిమాలకు సబంధించిన పోస్టర్స్ లో రిలీజ్ తరువాత వందల కోట్లు కలెక్షన్లు వస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఇదే ఇప్పుడు ఐటీ రైడ్స్ కు దారి తీసినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయ్యి.. సరిగ్గా కలెక్షన్లు రాలేదన్న సంగతి తెలిసిందే. కాని ఈమూవీ టీమ్ మాత్రం ఫస్ట్ డేనే 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు పోస్టర్ వేసేవారు. దాంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రతీ ఒక్కరి దగ్గర ఇదే డిస్కర్షన్ నడిచింది. మరో వైపు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియా కాకపోయినా.. వారం తిరక్క ముందే 200 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్స్ రిలీజ్ చేశారు. అందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఇవి ఇలా వైరల్ అవ్వడం వల్లే ఆయనపై నేడు ఇలా ఐటీ దాడులు జరిగాయని సమాచారం. అయితే ఇండస్ట్రీలో దిల్ రాజుకు మంచి పేరు ఉంది. ఆయన ఎప్పుడు టాక్స్ లు ఎగ్గట్టలేదు. ఇటువంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు అని ఆయనకు పేరు. ఆ పేరు వల్లే.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించారు సీఎం. అంతే కాదు దిల్ రాజు ఐటీ సోదాల్లో క్లీన్ చిట్ తో బయటపడుతారని ఆయన్ని సినిమా జనాల నమ్మకం. ఇక ఇక్కడ మరో విషయం వైరల్ అవుతోంది. ఈఐటీ సోదాల్లో 400 కోట్లలెక్కలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 400 కోట్లు ఏంటి.. ఏ లెక్కలు.. సినిమాలవా.. దిల్ రాజు పర్సనల్ లెక్కలా.. అసలు ఇందులో నిజం ఎంతా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ టార్గెట్..?
కేవలం ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రమే కాకుండా.. ఓ సినిమాకు 1800 కోట్లు వసూలు చేశాయంటూ భుజాలు చరుచుకున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, సీఈఓ చెర్రీల ఇళ్లపై ఐటీ సోదాలు చేశారు. అలాగే మ్యాంగో సంస్థలో కూడా ఐటి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హడావుడి నెలకొంది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన ఈ నిర్మాతలు ఇప్పుడు ఐటీ అధికారుల దృష్టిలో పడ్డారు. ఎందుకంటే? దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించగా, దిల్ రాజు నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో విస్తరించింది. మరోవైపు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ ద్వారా డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఆ సినిమాల హడావుడిలో ఉండగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దిల్ రాజు బంధువులు, కూతురు హన్సితా రెడ్డి నివాసాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ వంటి పాన్ ఇండియా చిత్రంతో సంచలన విజయాన్ని సాధించిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఐటీ అధికారుల దృష్టిలో నిలిచారు. మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్, సీఈవో చెర్రీ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో పాటు మైత్రి సంస్థ భారీ స్థాయిలో చిత్రాలను నిర్మిస్తోంది. ఈ రైడ్స్‌లో పెద్ద స్థాయి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం విషయంలో ఈ నిర్మాతలు ముందంజలో ఉంటారు.
హీరోలపై కూడా ఐటీ అధికారుల ఫోకస్.. ఎందుకంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదాయ పన్ను శాఖ దాడులు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి బడా నిర్మాణ సంస్థలు, పెద్ద సినిమాలు, ప్రఖ్యాత నిర్మాతలు మాత్రమే కాకుండా, కొన్ని ప్రముఖ హీరోల ఆర్థిక లావాదేవీలు కూడా విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పెద్ద బ్యానర్ల నుండి భారీగా అడ్వాన్సులు తీసుకున్న విషయాలపై కూడా ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారాని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖ హీరోలు పెద్ద బ్యానర్ల నుండి తమ తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్న మాట వాస్తవమే. అయితే, ఈ లావాదేవీలలో కొంత భాగం క్యాష్ రూపంలో జరగడమే సమస్యగా మారిందట. నిబంధనల ప్రకారం, లావాదేవీలు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరగాలి. కానీ క్యాష్ రూపంలో చెల్లింపులు జరగడం పన్ను ఎగవేతకు దారితీస్తుందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్టన్నింగ్ లుక్ ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ చిత్రాల సంఖ్య పెరిగిన క్రమంలో, హీరోల రెమ్యునరేషన్లు కూడా అమాంతం పెరిగాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు పాన్ ఇండియా హీరో 100 కోట్లకు పైనే ఛార్జ్ చేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు సైతం 15 కోట్ల నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తంలో కొంత భాగం నిర్దిష్టంగా బ్యాంక్ లావాదేవీల ద్వారా పరిగణనలోకి వస్తుండగా, మిగతా భాగం క్యాష్ రూపంలో తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పన్ను దాడులకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐటీ దృష్టి బడ్జెట్ లావాదేవీలతో పాటు క్యాష్ ట్రాన్సాక్షన్లపై ఉంది. క్యాష్ పేమెంట్ల వ్యవహారంపై విచారణ జరిపేందుకు, బ్యానర్లు చెల్లించిన మొత్తాలు, హీరోల స్వీకరించిన రశీదులు, వాటికి సంబంధించిన డేటాను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ పేమెంట్లు పన్ను చెల్లింపులకు సంబంధించి నిబంధనల్ని పాటించాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక ఈ పరిణామాలు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలు తమ లావాదేవీలను పారదర్శకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు నమ్మకం కోల్పోయేలా చేయగలవు, కాబట్టి భవిష్యత్తులో ఇండస్ట్రీ మొత్తం పన్ను చెల్లింపుల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళుతోంది. కానీ ఈ ఐటీ దాడులు పరిశ్రమపై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే విషయం ఆసక్తిగా మారింది. పారదర్శకత పెంచడమే దీనికి ఒక పరిష్కారమని పరిశ్రమలో పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
లెక్కలు చెప్పు మాస్టారూ
నిన్నటి నుంచి టాలీవుడ్ లో చేస్తున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. పలువురు బడా టాలీవుడ్ నిర్మాతల ఇళ్ల దగ్గర నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు చేయడం చర్చకు దారి తీసింది. నిర్మాతలు మాత్రమే కాదు పలువురు ఫైనాన్షియర్స్ పైన కూడా ఈ రైడ్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ప్రొడ్యూసర్లు, ఫైనాన్షియర్ల వరకు మాత్రమే పరిమితమైన ఈ ఐటీ దాడులు తాజాగా డైరెక్టర్ల వరకు చేరుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ‘పుష్ప 2’ డైరెక్టర్ సుకుమార్ ఇంటి మీద కూడా ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ మంగళవారం ఉదయం సుకుమార్ ను ఎయిర్ పోర్ట్ నుంచి దగ్గరుండి మరీ నేరుగా ఇంటికి తీసుకెళ్లినట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఐటి అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప 2’ మూవీ నిర్మాణంలో తన బ్యానర్ ను భాగస్వామిగా చేయడమే సుకుమార్ పై ఈ రైడ్స్ కారణం అని తెలుస్తోంది.
చెప్పుకుంటారా..?
ఇటీవల కాలంలో టాలీవుడ్ నిర్మాతలు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా తమ సినిమాలకు వస్తున్న కలెక్షన్లను అఫీషియల్ గా వెల్లడిస్తూ, ప్రేక్షకుల దృష్టిని సినిమా వైపుకు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రేక్షకుల దృష్టితో పాటు నిర్మాతలపై ఐటి అధికారుల దృష్టి కూడా పడింది. ఇంకేముంది ఫలితంగా ఐటి అధికారులు వరుసగా టాలీవుడ్ బడా నిర్మాతల ఇళ్లపై, ఆఫీసులపై మెరుపు దాడులు చేస్తున్నారు. ‘పుష్ప 2’ మూవీ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏకంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 1850 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ‘పుష్ప 2’ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే మైత్రి మూవీస్ ఆఫీస్ పై అలాగే నిర్మాత నవీన్ యెర్నేని, సీఈవో చెర్రీ ఇళ్లపై ఐటీ అఫీషియల్స్ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘పుష్ప 2’తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఐటీ శాఖ టార్గెట్ చేస్తుండడం గమనార్హం.
సమాచారం బయటకు రాకుండా వచ్చేశారు
ఈసారి జరిగిన దాడులు పెద్ద ఎత్తున సంచలనం రేపాయి. గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువమంది ఐటి అధికారులు సోదాలు నిర్వహిడం విశేషం. దాదాపు వందమంది ఈ సోదాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాబట్టి టాలీవుడ్ చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ ఐటి రెయిడ్ రికార్డ్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు, వారి కుటుంబ సభ్యులు, కార్యాలయాలు, అలాగే అగ్రస్థాయి ఫైనాన్షియర్లపై జరిగిన ఈ దాడులు పరిశ్రమలో మరింత లోతైన ఆర్థిక వ్యవస్థను వెలుగులోకి తెచ్చాయి. ముఖ్యంగా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, అభిషేక్ అగర్వాల్ వంటి పెద్ద పేర్లను ఈ దాడులు స్పృశించాయి. షేక్ చేసిన టాప్ 10 మూవీస్! మైత్రి మూవీ మేకర్స్‌కు అర్థిక సాయాన్ని అందించిన వెంకట సతీష్ కిలారు వంటి నూతన నిర్మాతలపైనా కూడా దాడులు జరిపారు. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్‌లో కొత్త సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరి ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, పన్నుల చెల్లింపుల నిబద్ధతను పరిశీలిస్తున్నారు. ఈ దాడులు కేవలం ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రమే కాకుండా, ఫైనాన్సింగ్ పద్ధతులపై మరింత స్పష్టత తీసుకొస్తున్నాయి. ప్రముఖ ఫైనాన్షియర్ సత్య రంగయ్య పేరు కూడా ఈ దాడుల్లో ప్రధానంగా వినిపిస్తోంది. దశాబ్దాలుగా టాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సత్య రంగయ్య, నిర్మాతలకు ప్రాధాన్యతను అందించే వ్యక్తిగా నిలిచారు. అయితే, అతని వ్యవహారాలను పన్ను అధికారులు పరిశీలించడం పరిశ్రమలో ఆర్థిక నిర్వహణ పట్ల జాగ్రత్తల అవసరాన్ని సూచిస్తోంది. రిలయన్స్ శ్రీధర్ వంటి ఆర్థిక మేధావులపైనా కూడా దాడులు జరిపారు. గతంలో అనేక పెద్ద బడ్జెట్ సినిమాలను విజయవంతంగా నిర్వహించిన శ్రీధర్ వ్యవహారాలు కూడా విచారణలో భాగమయ్యాయి. ఐటీ అధికారులు ఈ దాడుల ద్వారా పెద్ద బడ్జెట్ సినిమాలకు సంబంధించి పన్నుల చెల్లింపుల విధానాలను పరిశీలిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం పెరుగుతున్న నేపధ్యంలో, ఈ దాడులు మరింత ఆసక్తికరంగా మారాయి. ముందు వేణు స్వామి క్షమాపణ పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం చేసే పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు, ఫైనాన్సింగ్ పద్ధతులు మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొడక్షన్ హౌస్‌లు, ఫైనాన్షియర్ల మధ్య వ్యవహారాలను మరింత స్పష్టతతో నిర్వహించడం వలన పరిశ్రమ నిబద్ధతను పెంచుకోవచ్చు. ఇటువంటి దాడులు పరిశ్రమలో ఆర్థిక పారదర్శకతను తీసుకురావడమే కాకుండా, దాగుడుమూతలు ఆడే లావాదేవీలకు పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు తగ్గిపోవడం మాత్రమే కాకుండా, సమర్థమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ దాడులు టాలీవుడ్‌లో ఆర్థిక వ్యవస్థకు గుణపాఠంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫేక్అంటే..?
టాలీవుడ్ లో పలువురు ప్రముఖ నిర్మాతల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరిగాయి. దిల్ రాజు, శిరీష్, హన్సితా రెడ్డి, మైత్రీ నవీన్ యెర్నేని, మైత్రీ సీఈఓ చెర్రీ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసాలు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ కారణంగానే మేకర్స్ కు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. అలానే మొన్న సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో దిల్ రాజు మిశ్రమ ఫలితాలను అందుకున్నారు. అయినా సరే భారీ వసూళ్లు రాబట్టినట్లుగా ఎప్పటికప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ డైలీ అప్డేట్లు ఇస్తున్నారు. ఇవే ఇప్పుడు ఆదాయపన్ను శాఖ దృష్టిని ఆకర్షించడంతో అధికారులు దాడులు చేసినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే ‘గేమ్ ఛేంజర్’ మూవీ హిట్టైందని రుద్దడానికి ఫస్ట్ డే 186 కోట్లు వసూలు చేసినట్లు ఫేక్ పోస్టర్ వేయిచారని, దీని వల్లనే నిర్మాత దిల్ రాజు మీద ఐటీ దాడులు జరుగుతున్నాయిని అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ‘పుష్ప 2’ చిత్రాన్ని ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్‌గా చూపించాలనే ఉద్దేశ్యంలో మైత్రీ టీమ్ ఫేక్ పోస్టర్లు విడుదల చేసారని, అదే ఇప్పుడు నిర్మాతలను ఇబ్బంది పడేసిందని రామ్ చరణ్, పవన్ కల్యాణ్ అభిమానులు రివర్స్ లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో ఐటి రైడ్స్ నేపథ్యంలో, ఇరు వర్గాల అభిమానులు ఒకరి మీద మరొకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ‘సినిమాకి వచ్చిన కలెక్షన్లు ఎక్కడ?’ అని అధికారులు ప్రశ్నిస్తే.. ‘పోస్టర్స్ లో’ అని నిర్మాతలు బదులిచ్చినట్లుగా ఫన్నీ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖుల మీద ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం అనేది కొత్త విషయమేమీ కాదు. కాకపోతే గత కొన్నాళ్లుగా హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ బాగా ఎక్కువగా జరుగుతుండటంతో.. ఈ ఇష్యూని కూడా పరస్పరం విమర్శలు చేసుకోడానికి వాడుకుంటున్నారు అంతే. ఇది కూడా బిగ్గెస్ట్ రికార్డ్! నిజానికి నిర్మాతలకు కలెక్షన్ పోస్టర్లు రిలీజ్ చెయ్యాలని ఉండదు. ఎవరూ తమ ఆర్థిక లావాదేవీలను బయటకు చెప్పుకోవాలని అనుకోరు. ఎందుకంటే తమకు వచ్చిన ఇన్కమ్ పబ్లిక్ గా చెబితే, దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ హీరోల ఒత్తిడి మేరకు తమ సినిమాలు ఇంత వసూలు చేశాయి, అంత కలెక్ట్ చేశాయి అంటూ అధికారికంగా ప్రచారం చేసుకోక తప్పడంలేదు. హీరోల అభిమానులను సంతోష పరచడానికి, జనాలను థియేటర్ల వరకూ రప్పించడానికి కూడా పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒరిజినల్ గా ఆ సినిమాలు ఎంత కలెక్షన్స్ రాబట్టాయనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇండియాలో అన్ని ఏరియాలలో సరైన ట్రాకింగ్ ఉండదు. అలాంటి సందర్భాల్లో థియేటర్ ఓనర్లు చెప్పేవే నంబర్స్. అందుకే ఒక అంచనా ప్రకారం గ్రాస్ కలెక్షన్లు లెక్కగట్టి పోస్టర్లు వేస్తుంటారు. కిందరు ఒకడుగు ముందుకేసి వచ్చిన దానికంటే రెండింతలు పెంచి కలెక్షన్స్ చెబుతున్నారు. కానీ ఆ అంశాలే నిర్మాతలకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ఐటీ రైడ్స్ జరిగే వరకూ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ అదే జరుగుతోంది. ఇవేవీ తెలియని అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అని చెప్పుకోడానికి, ఎప్పటిలాగే ఇతర హీరోల ఫ్యాన్స్ తో వార్స్ చేసుకుంటూ ఉంటారు.