Monday, January 27, 2025

ఐటీ దాడుల్లో గుట్టు రట్టు, కేసు నమోదు స్టార్ హీరోపై గురి..!?

కొందరు సినీ ప్రముఖుల పై ఐటీ అధికారులు సుదీర్ఘంగా నిర్వహించిన సోదాలు ముగిసాయి. నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన ఐటీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. సినిమాలకు సంబంధించి వచ్చిన ఆదాయం.. చెల్లించిన పన్నుమొత్తంలో భారీ తేడా ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కేసు నమోదు చేసారు. భారీగా నిధుల గోల్ మాల్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ సోదాల్లో కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముగిసిన సోదాలు సినీ ప్రముఖుల పై ఐటీ దాడులు సంచలనంగా మారాయి. సంక్రాంతికి విడుదల అయిన పెద్ద సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగాయి. ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సినిమాలకు వచ్చిన ఆదాయం నిర్మాణ సంస్థల ఆదాయం, ట్యాక్స్​చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో, పన్ను ఎగవేత కేసు నమోదు చేసారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఆదాయపు పన్నుశాఖ అధికారులు తనిఖీలు చేసారు. మూడు రోజుల పాటు సాగిన ఐటీ అధికారుల సోదాలు అర్ద్రరాత్రి పూర్తి చేసారు.

ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్‌ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దర్శకుడు సుకమార్ ఇంట్లో సోదాలు ఆసక్తి కరంగా మారాయి. సినీ ఫైనాన్షియర్ల ఇళల్లోనూ సోదాలు కొనసాగించారు. మూవీ మేకర్స్ ఇచ్చిన సమాచారం మేరకు వారి ఆర్దిక లావా దేవీల పైన ఆరా తీసారు. ప్రధానంగా పుష్ఫ -2 కలెక్షన్ల ఆధారంగా ఈ సోదాలు చేసారనే చర్చ వినిపిస్తోంది. అందులో భాగంగానే దర్శకుడు సుకుమార్ నివాసంలోనూ సోదాలు చేసినట్లు చెబుతున్నారు. నెక్స్‌ట్‌ టార్గెట్ ఆదాయపు పన్నుశాఖ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్​రావిపూడి స్పందించారు. రెండేళ్లకు ఓసారి ఐటీ సోదాలు సర్వసాధారణమని అనిల్​అభిప్రాయపడ్డారు. భారీ వసూళ్లు రాబట్టాయని చిత్ర యూనిట్లే ప్రకటించటంతో.. అందుకు సంబంధించిన పెట్టుబడులను ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీసారు. ఈ సినిమాలకు ఖర్చు .. వసూళ్ల లెక్కల పైన విచారణ చేసారు. ఈ మేర పన్ను చెల్లించారా లేదా అనే కోణంలో విచారణ చేసిన ఐటీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, తాజా సోదాల్లో సేకరించిన సమాచారం తో త్వరలో ఐటీ అధికారులు త్వరలో హీరోల ఇళ్లు – కార్యాలయాల్లోనూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ఐటీ సోదాల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com