హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూకట్‌పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్‌లోని ఇళ్లులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పది బృందాలు పాల్గొంటున్నాయి. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్ ఐ బ్లాక్‌లోని ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న బీఆర్‌కే న్యూస్ చానల్ అధినేత బొల్లా రామకృష్ణ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్ చానల్‌తోపాటు ఫైనాన్స్, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయన నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది అధికారులు ఆయన అపార్టుమెంటులో సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ పరిశీలిస్తున్నారు.