Saturday, May 10, 2025

అదంతా తప్పుడు ప్రచారం పాక్‌ ఇంకా రెచ్చగొడుతూనే ఉంది

S-400 వ్యవస్థ, విమానాశ్రయాలపై దాడి జరిగిందని పాకిస్తాన్ చేసిన తప్పుడు వాదనలను భారత్ తిప్పికొట్టింది. జరగుతున్న పుకార్లను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తోసిపుచ్చారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. భారత S-400 వ్యవస్థ నాశనమైందని, సూరత్- సిర్సాలోని విమానాశ్రయాలు ధ్వంసమైనట్టు తప్పుడు వాదనలు చేసింది. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు వాదనలను భారతదేశం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. తమ సైన్యం నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు దుష్ప్రచారాన్ని ప్రోత్సహిస్తోందని విక్రమ్ మిస్రి అన్నారు. దేశంలోని వివిధ సైనిక స్థావరాలపై దాడి చేసి నాశనం చేస్తున్నారనే వాదన పూర్తిగా అబద్ధం. ఆధారాలతో స్పష్టం చేశారు. గత రెండు-మూడు బ్రీఫింగ్‌లలో పాకిస్తాన్ రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహిస్తోందని మేము చెప్పాము. పాకిస్తాన్‌కు భారతదేశం గట్టి జవాబు చెప్పింది. గత 2-3 రోజులుగా పాకిస్తాన్ కార్యకలాపాలు రెచ్చగొట్టేవిగా కనిపిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం బాధ్యతాయుతంగా స్పందిస్తోంది అని అన్నారు. భారత్‌ వైపు నుంచి చేస్తున్న దాడులన్నీ ఉగ్రవాద స్థావరాలు, సైనిక ఆస్తులపై మాత్రమేననే స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని ప్రమాదంలో పడేస్తోంది. భారతదేశం ఈ మొత్తం ఆపరేషన్‌ను సంయమనంతో,కచ్చితత్వంతో, నైతిక సైనిక సూత్రాల ప్రకారం నిర్వహించింది.

పాక్ రెచ్చగొడుతుంది
` గత రెండు రోజుల నుంచి పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ కేవలం ప్రతిస్పందిస్తోంది. పాకిస్తాన్ దాడులను అడ్డుకుంటోంది.. తిప్పికొడుతోంది’ అని వివరించారు. అనంతరం కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. ‘ పశ్చిమ భాగం వైపు పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. భారత సైనికులు లక్ష్యంగా డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడులు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి కూడా కాల్పులకు తెగబడుతోంది. మిస్సైల్స్‌తో కూడా దాడులకు ప్రయత్నించింది. వాటిని ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసింది. భారత ఏయిర్ బేస్‌లపై దాడులకు యత్నించింది. ఉదమ్ పూర్, పఠాన్ కోట్, ఆదమ్ పూర్‌లతో పాటు మరికొన్ని చోట్ల కాల్పులకు తెగబడింది. పలువురు సైనికులు గాయపడ్డారు. ఇందుకు సమాధానంగా.. భారత దళాలు పాక్‌లోని మిలటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులు చేశాము. పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది. ఇది పరిస్థితి మరింత దిగజార్చే ప్రమాదకర చర్య‘ అని అన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ.. ‘ పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఇండియన్ S-400 సిస్టమ్‌ను.. సిర్సా, సూరత్ ఘర్‌లోని ఏయిర్ ఫీల్డ్స్‌ను ధ్వంసం చేసినట్లు ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలు. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com