Monday, February 3, 2025

‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ చిత్రం కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్‌టెంట్‌ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్, ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు, రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది – ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’గా మార్చారు. ఈ కొత్త టైటిల్ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పెరెపు ఓ హిలేరియస్ వీడియోతో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ గురించి కూడా హింట్ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com