Monday, April 21, 2025

జైలు నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన నౌక, 100 ఐఫోన్లు

బాలీవుడ్‌ హీరోయిన్ జాక్వెలిన్‌  పుట్టిన రోజు సందర్భంగా  ఆమెకు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఖరీదైన బహుమతులు ప్రకటించాడు. జాక్వెలిన్ బర్త్ డే కు ఓ విహార నౌకతో పాటు 100 ఐ పోన్ల ను గిఫ్డ్ గా ఇవ్వనున్నట్లు తెలిపాడు సుకేశ్ చంద్రశేఖర్. ఇంతకీ ఈ సుకేశ్ చంద్రశేఖర్ ఎవరో తెలుసుకదా? 200 కోట్ల రూపాయల అక్రమ నగదు చెలామణికి సంబంధించిన కేసులో 2015 లో అరెస్టైన సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. నేరపూరిత కార్యకలాపాల ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడని సుకేశ్ పై ఆరోపణలున్నాయి.

అంతే కాకుండా అనేక ఆర్థిక మోసాలకు సంబందించిన చీటింగ్ కేసులను సైతం సుకేశ్ చంద్రశేఖర్ ఎదుర్కొంటున్నాడు. జైల్లో ఉన్నప్పటికీ తాను ప్రేమించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పై ఎప్పటికప్పుడు తన అభిమానాన్నిచాటుతూ వస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు ఆగస్టు 11న జాక్వెలిన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఖరీదైన విహార నౌకను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు సుకేశ్. అంతే కాదు ఆమె అభిమానులకు ఏకంగా 100 ఐఫోన్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు జాక్వెలిన్‌ కు ప్రత్యేకంగా లేఖ రాశాడు సుకేశ్ చంద్రశేఖర్.

లేడీ జాక్వెలిన్‌ పేరుతో ఖరీదైన యాట్‌ ను బహుమతిగా ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు సుఖేశ్ చంద్రశేఖర్. 2021లో జాక్వెలిన్‌ కోరుకున్న లగ్జరీ విహార నౌకను ఇప్పుడు బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ నౌక ఈనెలలో ఆమెకు చేరుతుందని, దానికి అన్ని పన్నులు ఇప్పటికే చెల్లించానన్నాడు. ఈ నౌక ఖరీదు సుమారు 50 కోట్ల రూపాయలు ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వంద ఐ పోన్స్ అంటే ఎటు లేదన్నా కోటి రూపాయల పైమాటే. అదన్న మాట సంగతి సుకేశ్ చంద్రశేఖర్ జైల్లో ఉండి కూడా వ్యవహారం నడిపిస్తున్నాడు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com