Saturday, March 29, 2025

బాబుకి కనీస సెక్యూరిటీ కూడా లేకుండా చేస్తా-జగన్‌

మిర్చి యార్డ్‌కు పర్యటనకు వెళ్ళిన వైసీపీ అధినేత జగన్‌ చంద్రబాబుపై కారాలు.. మిరియాలు నూరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరులోని మిర్చియార్డ్‌కు పర్యటనకు వెళ్ళారు. అయితే ఈ పర్యటకు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన పట్టించుకోకుండా తన పర్యటనను కొనసాగించారు.

ఈ సందర్భంగా మిర్చి రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత అయిన తనకు ప్రొటోకాల్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అంటూ… కనీస పోలీస్ భద్రతను కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో మిర్చి రైతులకు అత్యధిక మద్దతు ధర ఇచ్చామని జగన్ చెప్పారు. ఇప్పుడు రైతు సమస్యలపై మాట్లాడేందుకు వస్తుంటే… తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని… అప్పుడు చంద్రబాబుకు సెక్యూరిటీ కూడా లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు చంద్రబాబుకి పట్టడం లేదని విమర్శించారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిపింది. అయినా ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి జగన్ గుంటూరు పర్యటన చేపట్టారు. ఈనాటి పర్యటనపై మరి ఈసీ తదుపరి చర్యలు తీసుకుంటుందా? లేదా? ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది వేచి చూడాలి.

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com