-
జైలులో నందిగామ సరేష్ ను జగన్ బెదిరించాడు : టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం
అప్రూవర్ గా మారతానని సందేశం
-
త్వరలో జగన్ జైలుకి వెళ్లటం ఖాయం
-
బయట పడిన ములాఖత్ వెనుక దాగిన కుట్ర కోణం
విజయవాడ : వైసిపి ఎమ్మెల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో వున్న నందిగామ సురేష్ ను ప్రేమతో పరామర్శించలేదు..తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని బెదిరించటానికి వచ్చాడని టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాధం అన్నారు. గుంటూరు జైల్లో జగన్ ములాఖత్ వెనుక దాగిన కుట్ర కోణం బయటపట్టేందుకు మాదిగాని గురునాధం శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాదిగాని గురునాధం మాట్లాడుతూ తన స్వార్థం రాజకీయం కోసం తనని వాడుకున్నాడని తెలుసుకున్న నందిగామ సురేష్ అప్రూవర్ గా మారనున్నట్లు జగన్ కి తన దూతల ద్వారా సందేశం పంపిస్తే ఆగమేఘాల మీద జగన్ పరిగెత్తుకుంటూ వచ్చాడన్నారు. నందిగామ సురేష్ మరో దస్తగిరి అవుతాడనే భయంతో పరామర్శకి వెళ్లిన జగన్ తీవ్రంగా నందిగామ సురేష్ ను బెదిరించాడని తెలిపారు. రాజధాని అమరావతి నాశనానికి పథక రచయిత తనేని పేరు ఎక్కడ బయటపెడతాడో అనే భయం జగన్ లో మొదలైందని..అందుకే నందిగామ సురేష్ ని నిజాలు బయట పెడితే చంపివేస్తానని బెదిరించాడన్నారు. అలాగే నందిగామ సురేష్ కుటుంబ సభ్యులకి కష్టాలు తప్పవని కూడా హెచ్చరించాడన్నారు.
జైల్ లో వున్న క్రిమినల్స్, అరాచక శక్తుల్ని కలిసే తీరిక జగన్ కి వుంది కానీ వరద బాధితులకి సహాయం చేసేందుకు తీరిక లేదని మండిపడ్డారు. జగన్ కి తను చేసిన తప్పులకి దొరికిపోతాననే భయం మొదలైంది…అందుకే ఆ కంగారులో పరోక్షంగా నిజాలు ఒప్పుకుంటున్నాడన్నారు. తనని తిడితే ఆ బావోద్వేగంలో టిడిపి ప్రధాన కార్యాలయం పై వైసిపి కార్యకర్తలు దాడి చేసినట్లు చెప్పటం విడ్డూరంగా వుందన్నారు.
దళితుడైన నందిగామ సురేష్ ను అప్రూవర్ గా మారితే మరో వివేకానందరెడ్డి అవుతావని బెదిరించటం దారుణమన్నారు. జగన్ కి దళితుల్ని తన స్వార్థ రాజకీయల కోసం వాడుకొని మోసం చేయటం అలవాటు గా మారిపోయిందన్నారు. ఒక వైపు వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోకుండా క్రిమినల్స్ పలకరించటానికి జగన్ ఇంత హడావుడిగా ఎందుకు వెళ్లాడో సమాధానం చెప్పాలన్నారు. నిజాలు బయటపెడతాడనే భయంతో వరద బాధితుల్ని పట్టించుకోకుండా క్రిమినల్స్ పలకరించటానికి వెళ్లిన జగన్ ను ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు. త్వరలోనే జగన్ చేసిన తప్పులకి పార్టీ జెండా పీక్కొని పారిపోయే పరిస్థితి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపి పొలిటికల్ సెక్రటరీ నరసింహా చౌదరి పాల్గొన్నారు.