Saturday, September 21, 2024

‘మిస్టర్ బచ్చన్’ లో జగపతి బాబు పూర్తి కావస్తున్న షూటింగ్

డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్‌’లో బిజిఎస్ట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జగపతి బాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. చెస్ మూవ్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ అదిరిపోయింది. ‘మిస్టర్ బచ్చన్‌’ లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్డ్ గా ప్రజెంట్ చేస్తున్నారు. రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది. ఇద్దరికీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ రాసుకున్నారు హరీష్ శంకర్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular