Sunday, April 20, 2025

జగ్గన్న లవ్ స్టోరీ సినిమాల్లోకి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ వివాదస్పద లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్‌డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందని అన్నారు. పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే సినిమాల్లోకి వస్తున్నానని ఆయన స్ఫష్టం చేశారు. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్ గా జగ్గారెడ్డి క్యారెక్టర్ ఉండనున్నది. పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని, దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని, తెలుగు,హిందీ భాషల్లో చిత్రం ఉంటుందని జగ్గారెడ్డి వెల్లడించారు.
ఆయన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా సినిమాలో పాత్ర ఉంటుందని రివీల్ చేశారు. ఇంటర్వెల్ ముందు నుంచి మూవీ చివరి వరకూ జగ్గారెడ్డి పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి సినిమా పోస్టర్‌లో ఆయన మాస్, ఫ్యాక్షన్ హీరో క్యారెక్టర్‌గా కత్తులతో కనిపిస్తున్నారు. బాలయ్య రేంజ్‌లో పోస్టర్ కటౌట్ ఉంది. జగ్గారెడ్డి నటిస్తున్న సినిమాలో లవ్ స్టోరీ ఉంటుందట. ఈ సినిమాకి వడ్డి రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com