కేటీఆర్, హరీష్‌రావుకు మతిభ్రమించింది
రేవంత్ చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు.. నేను, రేవంత్ ఫైటర్స్…
బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మరోసారి మాస్ వార్నింగ్
తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటోడు దొరికితే ఖైరతాబాద్ చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తనదైనశైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒకరిద్దరు కలెక్టర్లకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎత్తలేదని, పదిసార్లు ఫోన్లు చేసినా ఎత్తకుంటే తిట్టానని, అయితే, ఇప్పుడున్న మహిళా కలెక్టర్‌ను తిట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి ట్రోల్ చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. నాకు కోపమొస్తే మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులనే తిట్టానని చెప్పుకొచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ హయాంలో కలెక్టర్లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. వాళ్లని తిట్టాను.. తప్పేంటి? నేను తిట్టింది గత ప్రభుత్వంలో… ఇప్పుడు కాదని వివరణ ఇచ్చారు.
బిఆర్‌ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బిఆర్‌ఎస్‌కు చెందిన దండుపాళ్యంవాళ్లు అమెరికాలో ఉండి కేటీఆర్ ఫొటోలు పెట్టుకుని మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారనీ, కేటీఆర్…ఇది పద్దతి కాదనీ మంచిగా చెప్తున్నాని జగ్గారెడ్డి అన్నారు. అధికారంపోయే సరికి కేటీఆర్, హరీష్‌రావుకు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతు న్నారు. సిఎం రేవంత్‌రెడ్డి పని మొదలు పెట్టి కేవలం పది నెలలు మాత్రమే అయిందనీ, అప్పుడే బిఆర్‌ఎస్ నాయకులు నాలుగేండ్లు ఎప్పుడవుతందా అని ఎదురుచూడటమే కాకుండా, సిఎం రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని బదునాం చేద్దామని చూస్తున్నారన్నారు. నేను, సిఎం రేవంత్‌రెడ్డి ఫైటర్స్ అని, కేటీఆర్, హరీష్‌రావు మాదిరిగా ఆంధ్రోళ్ల పేరు పెట్టి తాము తిట్టమన్నారు.
ఇప్పటికైనా కేటీఆర్ సోషల్ మీడియాను కంట్రోల్‌లో పెట్టుకో వాలనీ, లేదంటే మా సంగతి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా కంట్రోల్ కాకపోతే.. కేటీఆర్..హరీష్‌రావును నడిరోడ్డు మీద నిలదీస్తామన్నారు. సిఎం రేవంత్ చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు అని, అంతేకాదూ, రేవంత్‌రెడ్డి గట్టి పిండమన్నారు. రేవంత్ తొడ కొడితే కేటీఆర్ కు కాళ్లు వణుకు తాయన్నారు. ధైర్యం చేయడంలో రేవంత్‌రెడ్డితో నాతో కేటీఆర్, హరీష్‌రావు పోటీపడలేరన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా బుసలు కొడుతుందనీ, బుసలే కదా అని ఇప్పటివరకు వొదిలేశామనీ, కరవడా నికొస్తే మాత్రం చంపుతామన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి, నా మాటలు మొరటుగా ఉన్నా మేమిద్దరం మంచోళ్లమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.