Wednesday, July 3, 2024

జాన్వీ డెబ్యూ ఆశలు

జాన్వీ క‌పూర్ లో బాలీవుడ్ లో గ్రాండ్ స‌క్సెస్ అయింది. అంతే గ్రాండ్ గా టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోంది. తొలి సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న ‘దేవ‌ర‌’లో న‌టిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కి ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఛాన్స్ అందుకుంది.

అమ్మ‌డు ఇంకా క‌మిట్ అవ్వాలేగానీ చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు. బ‌డా నిర్మాణ సంస్థ‌లు, ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు ఎదురు చూస్తున్నారు. జాన్వీ చేసిన గెస్సింగ్ కంటే అమ్మ‌డికి ఇక్క‌డ బెస్ట్ లాంచింగ్ ద‌క్కింది.

రిలీజ్ త‌ర్వాత ఫ‌లితాలు ఎలా ఉంటాయి? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి మామ్ శ్రీదేవి ఇమేజ్ తో మాత్రం కొన్నాళ్ల పాటు అమ్మ‌డి కెరీర్ కి ఇక్క‌డ తిరుగుండ‌దు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఇంతే గ్రాండ్ గా కోలీవుడ్ లో నూ లాంచ్ అవ్వాల‌ని ప్ర‌ణాళిక వేసుకుంది. అనుకున్న‌ట్లు గానే కోలీవుడ్ స్టార్ సూర్య స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ వ‌చ్చింది.

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం ప్రకాష్ మెహ‌తా సూర్య‌తో ఓ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ప్లాన్ చేసారు. అందులో జాన్వీ అయితే ప‌ర్పెక్ట్ గా సూటువుతుంద‌ని ఆమెని ఎంపిక చేసారు. లుక్ టెస్ట్ కూడా చేసారు. పాత్ర‌కి ప‌ర్పెక్ట్ గా సెట్ అయింది. దీంతో జాన్వీ లో సంతోషం రెట్టింపు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular