Monday, March 10, 2025

బండ్ల గణేష్‌కి జైలు శిక్ష… అలాంటి పని చేశాడా?

బండ్ల గణేష్‌ సినీ నిర్మాత ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాల్లోనే ఈయన పాపులర్‌ కాదు ఇటు రాజకీయాలు అటు సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హల్‌చల్‌ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బండ్ల గణేష్ కి ఏడాది పాటు జైలు శిక్షపడింది. చెక్‌ బౌన్స్‌ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. ఒంగోలు సెకండ్‌ ఏ ఎంఎం హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానా కూడా విధించినట్లు సమాచారం. ఈ శిక్షను అప్పీల్‌ చేసుకునేందుకు ఒక నెలరోజులు గడువు కూడా ఇచ్చింది. జట్టి వెంకటేశ్వరులు అనే వ్యక్తికి పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అనే పేరుతో ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో ఆయన బండ్ల గణేష్‌ పైన కేసు వేశారు. ఈ తీర్పుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com