జక్కన్న, మహేష్ బాబు కాంబోలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లలో చాలా సీక్రెట్ గా మూవీ పూజా కార్యక్రమాలు జరగ్గా.. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించినట్లు ఇన్ డైరెక్ట్ గా రాజమౌళి ఓ వీడియో ద్వారా తెలిపారు. సింహాన్ని బంధించి.. చేతిలో పాస్‌పోర్ట్ పట్టుకున్న వీడియోను షేర్ చేసిన జక్కన్న.. సినిమా కంప్లీట్ అయ్యేవరకు మహేష్ ను లాక్ చేసినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. అయితే ఆ వీడియోకు మహేష్.. తాను ఒకసారి కమిట్ అయితే తన మాట తానే వినని కామెంట్ పెట్టారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ చేశారు. దీంతో SSMB 29లో ప్రియాంక నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఎప్పటి నుంచో వస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. అయితే ఆమె మహేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తుందా.. లేక కీలక పాత్ర పోషిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం హీరోయిన్ గా అయితే ఆమె సెట్ అవ్వదేమోనని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని, హీరోయిన్ గా ఇండోనేసియా బ్యూటీ యాక్ట్ చేస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్న ప్రియాంక.. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడి సిద్ధార్థ్ చోప్రా వివాహం కోసం విరామం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ముంబైకి వెళ్తూ కెమెరాలకు చిక్కింది. అయితే ప్రియాంక బ్రేక్ తీసుకున్నా.. షూటింగ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉందట.