Wednesday, May 14, 2025

అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ‘జలియన్‌వాలా బాగ్’

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే నటించిన ప్రధాన పాత్రలు, ఎమోషన్స్ తో నిండిన కోర్ట్ సన్నివేశాల్లో వారి నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోకి డబ్ చేయబడి మే 23న విడుదల కాబోతుంది. ఇప్పటికే హిందీ వర్షన్‌కు విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు రావడంతో, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం వల్ల, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘కేసరి ఛాప్టర్ 2’ తో ప్రేక్షకులకు పవర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com