Wednesday, December 25, 2024

Jamili Bill introduce in Lok Sabha నేడు లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు

సభలో  ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి
అనంతరం జెపిసికి పంపేందుకు సిద్ధ్దం

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్వాల్‌ 129‌వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ బిల్లును సోమవారం సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రివైజ్‌ ‌చేసిన లోక్‌సభ బిజినెస్‌ ‌జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్ ‌జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను  పెట్టలేదు. దీంతో ఈ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు. మంగళవారం ఈ బిల్లులు లోక్‌షభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ డియా పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్ర అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదే కాదు.

1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ ‌చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. ఈ క్రమంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత  లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.  ఎట్టకేలకు పార్లమెంట్‌ ‌ముందుకు ఈ బిల్లు రానుంది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం లోక్‌సభ లో ప్రవేశపెట్టనుంది. జమిలి ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్నవేళ దీనిపై విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ కి పంపించాలని స్పీకర్‌ ఓం ‌బిర్లాను కేంద్రమంత్రి అభ్యర్థించనున్నారు.

అనంతరం దీనిపై ప్యానెల్‌ ‌కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని సభాపతి పార్టీలను కోరనున్నారు. సాయంత్రానికి కమిటీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో వారికి చోటు దక్కుతుంది. అంటే అతిపెద్ద పార్టీ అయిన భాజపా నుంచి ఒక ఎంపీ కమిటీ ఛైర్మన్‌గా ఉంటారు. తొలుత ఈ ప్రతిపాదిత కమిటీకి 90 రోజుల సమయం కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత దాన్ని పొడిగిస్తారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జమిలి ప్రణాళికకు ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులను కేంద్ర కేబినెట్‌ ఈనెల 12న ఆమోదించింది. వీటిని ఈ పార్లమెంట్‌ ‌సమావేశాల్లోనే లోక్‌సభ ముందుకుతీసుకురావాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలు  ఈనెల 20తో ముగియనున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com