-
ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన జాన్వీకపూర్
-
ఎన్టీఆర్ తో డ్యాన్స్అనుభవాలను పంచుకున్న బ్యూటీ
అతిలోక సుందరి శ్రీదేనికూతురు జాన్వీకపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ బాలీవుడ్బ్యూటీ ఎన్టీఆర్ కు అభిమాని కూడా. తనకు అవకాశం వస్తే టాలీవుడ్ లో ఎన్టీఆర్ తోకలిసి నటించాలని ఉందని గతంలో ఓ ఇంటర్వూలో చెప్పింది జాన్వీ కపూర్. అన్నీ కలిసి వచ్చిఆమె అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ కు జతగా దేవరసినిమాలో నటిస్తోందామె. దేవరకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
తన తాజా సినిమా ఉలఝ్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర మూవీ షూటింగ్ అనుభవాలను పంచుకుంది జాన్వీ కపూర్. ఈ సందర్బంగా ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లుకురిపించింది. తెలుగువారి పనితీరు తనకు చాలా ఇష్టమని చెప్పిన జాన్వీ.. వారు కళను, సినిమాను గౌరవిస్తారంది. హుందాగా ప్రవర్తిస్తారని.. కథపై నమ్మకంతో పనిచేస్తారని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని చెప్పిన జాన్వీ.. ఆయన రాగానే సెట్‌కే కళ వస్తుందని నవ్వేసింది.
ఈ మధ్య జరిగిన షెడ్యూల్ లో ఎన్టీఆర్, తనపై ఓ పాటను షూట్ చేశారని చెప్పిన జాన్వీ కపూర్.. ఆయన డ్యాన్స్ వేసే వేగాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ ఒక్క సెకనులో దేన్నైనా నేర్చుకోగలరని.. అదే విషయాన్ని తాను నేర్చుకోవడానికి 10 రోజులు పడుతుందని తెలిపింది. అందుకే ఎన్టీఆర్ తో తర్వాత పాట చిత్రీకరణ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తన తల్లిదండ్రులు శ్రీదేవి,బోనీ కపూర్ నేర్పించారని చెప్పిందిజాన్వీ కపూర్.