Saturday, May 3, 2025

‘జయం’ ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

స్రవంతి సినిమా పతాకంపై కంటూరు రవికుమార్‌ చౌదరి నిర్మాతగా, జి. కిరణ్‌కుమార్‌ దర్శకత్వంలో సత్య మేరుగు`దీపిక జంటగా రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జయం’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ పోస్టర్‌లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, పీపుల్స్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణలు ముఖ్య అతిథిలుగా హాజరై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

చిత్ర నిర్మాత రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థ్యాంక్స్‌. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆ జయం లాగే ఈ జయం కూడా అంతే సక్సెస్‌ అవుతుంది అనిపించింది. మంచి విజన్‌ ఉన్న దర్శకుడు కిరణ్‌కుమార్‌. నేను ఇప్పటికే 4 సినిమాలను నిర్మించాను. వాటి ద్వారా 10 మంది హీరోలను పరిచయం చేశాను. ఈ సినిమా అందరికీ పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com