Friday, December 27, 2024

తాను మరణించినా.. 8 మంది జీవితాల్లో వెలుగు నింపిన మహిళ

సమాజంలో కొంత మంది మాత్రమే ఇతరులకు ప్రాణదానం చేస్తుంటారు. అందులో మక్తల్ పట్టణానికి చెందిన చాకలి జయమ్మ ఒకరు. జయమ్మ గత మంగళవారం కృష్ణ మండల పరిధిలో నల్లగట్టు మారెమ్మ దేవతకు మొక్కులు చెల్లించేందుకు వెళ్లగా అక్కడ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ కిందపడింది. ఈ సంఘటనలో జయమ్మకు తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికంగా ప్రాధమిక చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో జయమ్మ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఐతే జయమ్మ అవయవాలు దానం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉస్మానియా వైద్యులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు.
అవయవదానంపై జయమ్మ కుటుంబసభ్యులకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పించారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు జయమ్మ అవయవ దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. జయమ్మ కుటుంబసభ్యుల అవయవదానానికి ఒప్పుకోవడంతో అవసరం ఉన్నవారి వివరాలు సేకరించారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎనిమిది మందికి జయమ్మ అవయవాలతో జీవం పోశారు. ఆమె చనిపోయినా ఎనిమిది మంది జీవితాలలో వెలుగు నింపిన జయమ్మకు వైద్య సిబ్బంది ఘన నివాళులర్పించారు. మానవతా దృక్పథంతో అవయవదానానికి అంగీకరించిన కుటుంబసభ్యులను పలువురు అభినందలు తెలిపారు. అవయవదానం తరువాత జయమ్మ పార్థివదేహానికి మక్తల్ పట్టణంలో కాలనీవాసులు దారి పొడవునా దీపాలు, క్యాండిల్స్‌తో నివాళులర్పించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com