Sunday, October 6, 2024

జీన్స్,టీషర్ట్.. సాధారణ అమ్మాయిలా కమీషనర్

ఆమె సింప్లీసిటీ చూసి ఆశ్చర్యపోయిన సిబ్బంది

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటా డిఫరెంట్ లుక్‌ లో కనిపించారు. సిటీలో బుధవారం ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు అమ్రపాలి.

ఈ సందర్బంగా ఆమె ధరించిన జీన్స్, టీ షర్ట్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. గతంలో పెళ్లి కాకముందు వరంగల్ కలెక్టర్‌ గా పనిచేసిన సమయంలో ట్రెక్కింగ్‌ లాంటివి చేసినప్పుడు మాత్రమే జీన్స్, టీషర్ట్‌ లో కనిపించారు ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి. ఇదిగో ఇప్పుడు మరోసారి ఆ లుక్‌ లో కనిపించారు.

ఈ మధ్యే జీహెచ్ ఎంసీ కమీషనర్ గా చార్జ్ తీసుకున్న అమ్రపాలి.. జీన్స్, టీషర్ట్‌ తో హైదరాబాద్ రోడ్లపై సాధారణ అమ్మాయిలా ఎంట్రీ ఇచ్చి.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అక్కడ రోడ్లపై ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడి పారిశుద్ధ్యంపై వారికి అవగాహన కల్పించారు అమ్రపాలి. ఈ సందర్బంగా జీహెచ్ ఎంసీ సిబ్బంది పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular