Wednesday, December 25, 2024

TPCC Jeevan Reddy: టీపీసీసీ అధ్యక్షులుగా జీవన్ రెడ్డి..?

ఢిల్లీలో ముగిసిన జగిత్యాల” పంచాయితీ

కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు. జగిత్యాల బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను జీవన్ రెడ్డి కి సమాచారం ఇవ్వకుండా సింయం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకావడంతో మనస్తాపానికి గురి అయిన ఎమ్మెల్సీ సీఎం పై అసహనంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం లేపింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, విప్ లు లక్ష్మణ్ కుమార్, అది శ్రీనివాస్ లు జీవన్ రెడిని బుజ్జగించేందుకు జరిపిన చర్చలు సఫలం కాలేకపోగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి డిసైడ్ కావడం సంచలనం సృష్టించింది. తన ప్రత్యర్థి ఎమ్మెల్యే ను పార్టీలోకి తీసుకుని నన్ను అగౌరవ పరిచారని విలువలు లేని రాజకీయాలు అవసరం లేదని పార్టీలో కొనసాగుతూనే గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూస్తానని పేర్కొనడంతో కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది.

జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేసి వేణుగోపాల్, ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్సీ, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ లను జీవన్ రెడ్డితో పాటు పిలిపించింది. సోనియాగాంధీ ఈవిషయంలో జ్యోక్యం చేసుకుని రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి జీవన్ రెడ్డి విషయమై చర్చించి ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. అన్ని శాఖలపై పూర్తిస్థాయిలో పట్టు ఉన్న నేపథ్యం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి విషయంలో జీవన్ రెడ్డి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి చాలా అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తదనంతరం వచ్చిన ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, ఉద్యోగుల సహకారంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో 40 వేల భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 నిజామాబాద్.

పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పరాజయం చెందిన నిత్యం ప్రజాజీవితంలో ఉంటూ సమస్యల పరిష్కరిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోముందు ఉంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృస్టిని ఆకర్షించారు. సీఎంకు సన్నిహితంగా ఉండడం, ఎమ్మెల్సీగా కొనసాగుతుండడం మంత్రి పదవికి అర్హతలున్నా ఎమ్మెల్యే, ఎంపీగా ఓడిపోవడం,రెడ్డి సామాజిక వర్గంలో కేబినెట్ బెర్తులకోసం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు మంత్రి వర్గంలో ఉండడం జీవన్ రెడ్డికి ప్రతికూల అంశాలుగా మారాయన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. జీవన్ రెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ పదవి లేదా ఆయన హోదాకు తగ్గ ఉన్నత పదవి కట్టబెట్టి ప్రభుత్వ,పార్టీ ఆంతరంగిక విషయాల్లో ఆయన సేవలను వినియోగించుకోవాలని సోనియాగాంధీ ఆలోచన చేస్తున్నట్లు ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com