Saturday, September 14, 2024

జిగేల్’ ఫస్ట్ లుక్

త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా.వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో సాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.

ప్రముఖ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular