Friday, March 28, 2025

జిల్లాల్లోనూ శాండ్‌ బజార్‌లు

నిర్మాణ రంగంపై సర్కారు ఫోకస్‌

బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుక ధరలు ఎక్కడో ఉన్నాయి. దీంతో నిర్మాణరంగంపై కొంత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరకే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్‌ బజార్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకురానుంది. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవటం ఎంతో కష్టమైన పని. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇంటి నిర్మాణంలో చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఇసుక కొరత. అవసరమైన ఇసుక కోసం ఇండ్లు కట్టుకునే చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొందరు అధిక ధరకు బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుకను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక నుంచి బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుక కొనాల్సిన పని లేదు. తక్కువ ధరకే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్‌(ఇసుక) బజార్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరకు అందించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకురానుంది.

అన్ని జిల్లాల్లోనూ..!
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ శాండ్‌(ఇసుక) బజార్‌లు ఏర్పాటు చేసింది. నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్, బౌరంపేట, వట్టినాగులపల్లిలో శాండ్‌ బజార్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఆదిభట్ల, పటాన్‌చెరు, ఉప్పల్, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోనే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక బజార్‌లు ఏర్పాటు చేయాలని తాజాగా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలు చేపట్టే వారికి నాణ్యమైన ఇసుకను తక్కువ ధరకు అందించడం, ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. ఇటీవలే హెచ్‌ఎండీఏ పరిధిలో శాండ్‌ బజార్‌కు ఇసుకను తరలించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు, వాహనదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ దరఖాస్తులను ఆహ్వానించి డిమాండు మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాండ్‌ బజారులో టన్ను దొడ్డు ఇసుకను రూ.1,600, సన్న ఇసుకను రూ.1,800లకు విక్రయించనున్నారు. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో శాండ్ బజారులు ఏర్పాటు చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం హెచ్‌ఎండీఏ పరిధిలో శాండ్‌ బజార్‌కు ఇసుకను తరలించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు, వాహనదారుల నుంచి ప్రభుత్వం అఫ్లికేషన్లు ఆహ్వానించింది. ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ అఫ్లికేషన్లు ఆహ్వానించి వినియోగదారుల డిమాండు మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ శాండ్ బజార్లు అందుబాటులోకి వస్తే బ్లాక్‌లో ఇసుక కొనాల్సిన పని లేదు. ఇండ్లు కట్టుకునేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. ఇసుక పాలసీలో సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మైనింగ్‌ శాఖ సమీక్షల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండడంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతుండడంతోపాటు వినియోగదారుడిపై ఆర్థికభారం పడుతోంది. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన పాలసీని తీసుకురావడానికి కొన్ని నెలలుగా అధికారులు కసరత్తు చేశారు. ఇందులో భాగంగానే శాండ్‌ బజార్‌లు తెరపైకి వచ్చాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com