Saturday, May 3, 2025

కేవలం 1799 రూపాయలకే జియో సరికొత్త ఫీచర్స్ ఫోన్

భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ మొబైల్ నెట్ వర్క్ రంగంలోఎంత సంతలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిగో ఇప్పుడు రిలయన్స్ మరో జియోబడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. జియో భారత్ జే1 4జీ పేరుతోసరికొత్త బడ్జెట్ ఫోన్ ఆవిష్కరించింది జియో. ఇది 4జి కనెక్టివిటీతో ఎంట్రీ లెవల్ ఫీచర్ఫోన్ అని చెప్పవచ్చు. జియో భారత్ ప్లాన్‌ కు మద్దతుగా  జియో స్పెషల్ బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది. ఈ స్పెషల్ప్లాన్ లో జియో సినిమా, జియో టీవీ, జియో పే వంటి యాప్స్ ప్రీ ఇన్‌స్లాల్‌ చేసి అందిస్తోందిజియో.

జియో భారత్ జే1 4జీ  ఫోన్ రేర్ కెమెరా యూనిట్‌ తో మార్కెట్ లో అందుబాటులోకివచ్చింది. గత సంవత్సరం 2023 అక్టోబర్‌ నెలలో జియో విడుదల చేసిన జియో భారత్‌ B2 మరియుB1 ఫీచర్‌ ఫోన్ల కంటే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన జియో భారత్ జే1 4జీ ఫోన్‌ పెద్దడిస్‌ప్లే ను కలిగి ఉండటంతో పాటు తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. ఈ ఫీచర్ ఫోన్ అమెజాన్ద్వారా కేవలం 1,799 రూపాయలకే అందుబాటులో ఉంది. జియోభారత్ జే1 4జీ ఫోన్ డెడికేటెడ్ నేవిగేషన్ప్లస్ ఫిజికల్ కీప్యాడ్‌ తో పాటు 2.8 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది.

జియో భారత్ జే1 4జీ ఫోన్ థ్రెడ్ఎక్స్ ఆర్టీఓఎస్ వర్షన్తో పని చేస్తుంది. 0.13 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ లో స్టోరేజీకెపాసిటీని 128 జీబీ వరకూ ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. అంతేకాదు నెలవారీగా 14జీబీ డేటా,అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించే 123 రూపాయల 4జీ రీచార్జి ప్లాన్ ను సైతం అందిస్తుందిజియో. ముందస్తుగా ఇన్ స్టాల్ చేసిన జియో టీవీ యాప్ ద్వారా పలు రీజనల్ చానెళ్లతో కలిసి455 ప్లస్ చానెల్స్ ను వీక్షించే అవకాశం ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com