రిలయన్స్ జియో యూజర్ల కోసం అదిరిపోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వార జియో ఫోన్ కాల్ ఏఐ ద్వారా జియో యూజర్లు తమ కాల్‌ను రికార్డు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ట్రాన్స్ స్క్రైబ్ తో పాటు ట్రాన్స్ లేట్ కూడా చేసుకోవచ్చు. అంటే జియో ఫోన్ కాల్ ను రికార్డు చేసుకుని ఆ మాటలను పదాలుగా మార్చుకోవవడంతో పాటు ఇతర భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అత్యాధునిక ఏఐ సాంకేతికతో ఈ ఫీచర్ ను రూపొందిస్తోంది జియో. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో భాగంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇందుకు సంబందించిన ప్రకటన చేశారు. ఈ ఫీచర్ కాలింగ్ చేసే విధానాన్ని సరికొత్తగా మార్చేస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ఫోన్ కాల్స్ కంటే టెక్ట్స్ మెసేజ్‌లను ఇష్టపడే వ్యక్తులకు, వాటిని రికార్డ్ చేయడం ముఖ్యం అయిన వ్యక్తులకు ఈ ప్రత్యేకమైన ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని అన్నారు.
జియో ఫోన్ కాల్ ఏఐ ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే.. ముందు MyJio యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుని, యాప్‌లో లాగిన్ అవ్వాలి. Jio PhoneCall AI ఆప్షన్ పై క్లిక్ చేసి, మొదలుపెట్టడానికి కొన్ని సింపుల్ అనుమతులను అంగీకరించాలి. ఇక కాల్ చేయడానికి MyJio యాప్‌కి వెళ్లి, మీరు కాల్ చేయాలనుకుంటున్న వ్యక్తి పేరు లేదా నంబర్ ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు AI కాల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.. Jio AI మీ తరపున కాల్ చేసి, కాల్ ముగిసిన తరువాత సంభాషణను టెక్స్ట్‌గా మారుస్తుంది. మీరు ఎవరికైనా మెసేజ్ పంపాలని అనుకుంటే, మెసేజ్ టైప్ చేసినా లేదంటే మాటల రూపంలో చెప్పినా.. Jio AI మీరు పంపిన సందేశాన్ని కాల్ ద్వారా వ్యక్తికి చేరవేస్తుంది. Jio Phone Call AI సేవ కాల్ రికార్డింగ్‌లు, ట్రాన్‌స్క్రిప్ట్ చేయడం వంటి ఆఫ్షన్స్ ను అందిస్తుంది. Jio Phone Call AI పలు రకాల భాషలకు సైతం సపోర్ట్ చేస్తుంది. మీరు MyJio యాప్ సెట్టింగ్‌లలో హిందీ, ఇంగ్లీష్ లేదా ఇతర భారతీయ భాషల్లో మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా Jio AI అనుమానాస్పద కాల్స్ గురించి సమాచారాన్ని అందించడమే కాకుండా, మీకు ఏదైనా మోసపూరిత కాల్ వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది.