నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌పై ఎక్కువ ఫోకస్ పెడతామని నూతన డిజిపి జితేందర్ స్పష్టం చేశారు. బుధవారం డిజిపి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్‌కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ డిజిపిగా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డిజిపి జితేందర్‌గా రికార్డ్‌గా నమోదు చేసుకున్నారు.
కాగా, పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన జితేందర్ 1992 కేడర్ ఐపిఎస్ ఆఫీసర్. తొలుత ఎపి కేడర్‌లో పని చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం తెలం గాణకు అలాట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మల్, బెల్లంపల్లి ఎఎస్పిగా పనిచేసిన జితేందర్, మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పి గానూ పని చేశారు. అనంతరం డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఆయన సిబిఐ, గ్రేహౌండ్స్ లో వివిధ హోదాల్లో వర్క్ చేశారు.
అనంత రం డిఐజిగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్, వరంగల్ డిఐజిగా పనిచేశారు. తర్వాత సిఐడి, విజిలెన్స్‌లో వర్క్ చేయడంతో పాటు హైదరా బాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా, జైళ్ల శాఖ డిజిగా పనిచేసిన జితేందర్ ప్రస్తుతం డీజీపీ హోదాలో హోం శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫో ర్స్మెంట్ డిజి అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఆయనను డిజిపిగా నియమించింది. కాగా జితేందర్ 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో జితేందర్ 14 నెలలపాటు డిజిపి పదవిలో కొనసాగనున్నారు. డిజిపిని మార్చాలని సిఎం రేవంత్ రెడ్డి అనుకోలేదు కానీ రాష్ట్రంలో పరిస్థితులు లా అండ్ ఆర్డర్ పై వస్తున్న విమర్శలతో కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదని చెబుతున్నారు.
హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తా
ప్రస్తుతం డిజిపిగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల సమ యంలో డిజిపిగా ఉన్న అంజనీకుమార్ ఫలితాలు వెలువడక ముందే రేవంత్ రెడ్డిని కలవడంతో ఇసి ఆగ్రహించి బదిలీ చేసింది. ఆ స్థానంలో రవి గుప్తాను నియమించింది. ఎన్నికల ఫలితాల తర్వాత సిఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డిజిపిగా రవి గుప్తానే కొనసాగించాలని నిర్ణ యించారు.
సీనియర్ అధికారుల విషయంలో రేవంత్ ప్రత్యేక గౌరవం
అధికారుల విషయంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి కెసిఆర్ హయాంలోనే నియమితుల య్యారు. ఆయినప్పటికీ ఆమెను మార్చలేదు.