Tuesday, May 13, 2025

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, ఆయన కుమారుడు

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, ఆయన కుమారుడు
ఆయనకు ఢిల్లీ స్థాయి హోదా ఇస్తూ ఉత్తర్వులు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో ఆయన కుమారుడితో కలిసి జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలోనే జితేందర్‌రెడ్డికి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడల వ్యవహారాల) పదవిని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్టు ఆశించిన జితేందర్ రెడ్డికి నిరాశ మిగిలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి జితేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. చర్చలు సఫలం కావడంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి జితేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో జితేందర్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలోనే ప్రత్యేక హోదాను కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరిన గంట వ్యవధిలోనే జితేందర్‌రెడ్డికి ఢిల్లీలో పదవిని అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com